బాలయ్య అఖండ సినిమా కి తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ క్రేజ్ ఏర్పడింది. బాలయ్య బోయపాటి ది క్రేజీ కాంబినేషన్ అవ్వడం, ఆ కాంబినేషన్ లో ఆల్ రెడీ సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ లు రావడం వలన ఆ క్రేజ్ ఇంకా ఎక్కువ అయింది. ఆ క్రేజ్ వలనే ఓవర్సీస్ లో కూడా మాస్ మూవీస్ ని చూడటానికి ఇష్టపడని వాళ్ళు కూడా అఖండ కి ఎక్కువగా వెళుతూ ఉండటం విశేషం.
ఇక సినిమా తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ తర్వాత పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అద్బుతంగా దూసుకు పోతూ ఉంది, అక్కడ ఈ రోజు అఖండతో పాటు మరక్కార్ మూవీ అలాగే 3న లోకల్ గా మంచి క్రేజ్ ఉన్న మదగజ అనే సినిమా ఆల్ మోస్ట్ 80% స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడానికి….
సిద్ధం అవుతూ ఉండగా అన్ని సినిమాల బుకింగ్స్ మొదలు అయిన తర్వాత లోకల్ మూవీ మదగజ కన్నా కూడా అఖండ బుకింగ్స్ బెంగుళూరు లాంటి ఏరియాలో ఓ రేంజ్ లో ఉండటం తొలిరోజు అక్కడ 310 కి పైగా షోలు పడటం లాంటివి సినిమా క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి.
లోకల్ మూవీస్ ని కూడా డామినేట్ చేసేలా అక్కడ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటున్న అఖండ ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి రోజు కర్ణాటకలో వర్త్ షేర్ 80 లక్షల నుండి కోటి రేంజ్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ లెక్క…
ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా అఖండ బాక్స్ ఆఫీస్ క్రేజ్ అన్ని చోట్లా రచ్చ చేస్తుండటం, కర్ణాటకలో లోకల్ మూవీ ని కూడా డామినేట్ చేయడం ట్రేడ్ కి కూడా విస్మయం కలిగేలా చేస్తుంది అని చెప్పాలి. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ జోరు ఎలా ఉంటుందో చూడాలి ఇక.