మాస్ సినిమాలు అంటే ఇక్కడ విరగబడి జనాలు సినిమాను చూడటానికి థియేటర్స్ కి వస్తారు, మాస్ ని ఆకట్టుకునే కంటెంట్ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ కూడా వస్తాయి, కానీ ఇక్కడితో పోల్చితే ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రం సినిమాల రేటింగ్ లు అలాగే సినిమా క్లాస్ ఆ లేక మాస్ ఆ అన్నవి చూసి ఎక్కువగా క్లాస్ మూవీస్ ని ఇష్టపడుతూ ఉంటారు. అక్కడ మాస్ మూవీస్ కి పెద్దగా…
ఆదరణ ఉండదు అని అనేక కమర్షియల్ మాస్ మూవీస్ రిజల్ట్ చెబుతుంది. ఇక ఊరమాస్ మూవీస్ ని డైరెక్ట్ చేసే బోయపాటి శ్రీను మూవీస్ అంటే అక్కడ ఆడియన్స్ మరింత దూరం ఉంటారు అనేది సత్యం. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాల్లో ఒక్కంటంటే ఒక్కటి కూడా…
అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని అందుకోలేక పోయింది అంటే అక్కడ బోయపాటి సినిమాల పెర్ఫార్మెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. అలాంటి చోట బోయపాటి కెరీర్ హైయెస్ట్ గా అఖండ రిలీజ్ కి ముందు వరకు అల్లు అర్జున్ తో బోయపాటి చేసిన ఊరమాస్ బ్లాక్ బస్టర్ సరైనోడు సినిమా 879K డాలర్స్ తో టాప్ లో ఉండేది.
తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్ లో కుమ్మేసిన ఈ సినిమా అమెరికాలో మాత్రం మిలియన్ డాలర్ మూవీ కాలేకపోయింది. తర్వాత బోయపాటి వినయ విదేయ రామతో 1 మిలియన్ ని అందుకుంటాడు అనుకుంటే ఆ సినిమా దిమ్మతిరిగే డిసాస్టర్ అయ్యింది. ఇలాంటి టైం లో ఇప్పుడు బాలయ్యతో చేసిన మరో ఊరమాస్ మూవీ అఖండ మాత్రం ఇప్పుడు అక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ తో…..
లేటెస్ట్ గా సైరనోడుని దాటేసి 10 రోజుల టైం కే 950K మార్క్ ని అందుకుని బోయపాటి కెరీర్ లో ఫస్ట్ మిలియన్ మూవీ అవ్వడానికి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉంది. రెండు మూడు రోజుల్లో ఈ మార్క్ ని అందుకుని ఊరమాస్ మూవీస్ లో ఓ బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని అమెరికాలో నమోదు చేయబోతుంది అఖండ సినిమా…