నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అఖండ… ఆడియన్స్ ముందుకు 2021 ఇయర్ ఎండ్ లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ సినిమా రిలీజ్ టైం లో నార్త్ ఆడియన్స్ సినిమా ని చూసి…
ఈ మూవీ హిందీ లో వస్తే కచ్చితంగా ఊచకోత కోస్తుంది అని అంచనా వేసినా మేకర్స్ సినిమాను ఆ టైం లో హిందీ లో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉన్నా కానీ అలా చేయలేదు. కానీ సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత సినిమాను….
హిందీ లో డబ్ చేసి ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. ఆల్ రెడీ డిజిటల్ లో అందరూ ఈ సినిమాను చూసిన తర్వాత ఇప్పుడు సడెన్ ట్విస్ట్ ఇస్తూ అఖండ సినిమాను…
హిందీ లో ఇప్పుడు ఈ నెల 20న హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు లో వచ్చినప్పుడే ఊపులో సినిమాను అక్కడ రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా దుమ్ము లేపి ఉండేది సినిమా, కానీ ఇప్పుడు లేట్ గా రిలీజ్ అవుతున్న సినిమాకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.