బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు ఈ రేంజ్ బిజినెస్ ను సినిమా అందుకుంటుందా అన్న అనుమానాలు రేకేత్తినా కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా అఖండ. ఆల్ రెడీ 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసిన అఖండ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా…
మంచి హోల్డ్ ని సొంతం చేసుకుని డిసెంబర్ అన్ సీజన్ అంటారు అయినా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రాంపేజ్ అంటే ఇదే అనిపించేలా దూసుకు పోతూ ఇప్పుడు 50 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి టాలీవుడ్ లో ఈ ఇయర్ కి గాను….
50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న మూడో సినిమాగా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మార్క్ ని అందుకున్న ఫస్ట్ సినిమాగా నిలిచిన అఖండ సినిమా ఇప్పుడు 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి 51.82 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో 2.18 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని బాలయ్య కెరీర్ లో చాలా టైం తర్వాత క్లీన్ హిట్ గా మారబోతుంది. ఊహకందని బాక్ టు బాక్ 3 డిసాస్టర్ మూవీస్ తర్వాత ఈ రేంజ్ లో కంబ్యాక్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
ఇక సినిమా 7 వ రోజు సాధించే కలెక్షన్స్ తో ఈ మొత్తాన్ని చాలా వరకు అందుకునే అవకాశం ఉండగా కొంచం మిస్ అయినా 8 వ రోజు కలెక్షన్స్ తో క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు వెళుతుంది అన్నది చెప్పలెం కానీ సెకెండ్ వీకెండ్ లో కనుక హోల్డ్ చేస్తే 65 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.