Home న్యూస్ 3 డిసాస్టర్లు…..అయినా సీడెడ్ లో అఖండ మెంటల్ మాస్ రేటు!

3 డిసాస్టర్లు…..అయినా సీడెడ్ లో అఖండ మెంటల్ మాస్ రేటు!

1449
0

బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ పవర్ ఇదే… ప్రస్తుతం ఇద్దరూ కూడా ఫ్లాఫ్స్ లోనే ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోవడం ఖాయం, ఆ అంచనాలను నిలబెట్టుకునేలానే ఇప్పటి వరకు వచ్చిన 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన విజయాలను నమోదు చేశాయి. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబోలో…

ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా బిజినెస్ జోరుగా సాగుతూ ఉండగా ఆడియన్స్ లో సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా సాలిడ్ గానే ఆఫర్స్…

ఈ సినిమాకి వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా సినిమా సీడెడ్ ఏరియాలో బిజినెస్ ను అఫీషియల్ గానే కన్ఫాం చేసుకుని సెన్సేషనల్ రేటు కి అమ్ముడు పోయింది, బాలయ్య రీసెంట్ మూవీస్ ఎన్టీఆర్ సిరీస్ అండ్ రూలర్ సినిమాలు డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ ఈ సినిమా కి సీడెడ్ ఏరియాలో…

12 కోట్ల రేటు కి బిజినెస్ జరిగింది… ఇది వరకు బాలయ్య మూవీస్ లో రూలర్ సినిమా కి 5.2 కోట్లు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి 12 కోట్లు, జై సింహా సినిమా కి 5 కోట్ల రేంజ్ లో రేటు పలికింది, అన్నీ కూడా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాలయ్య బోయపాటి ల కాంబో మూవీ అవ్వడంతో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ…

ఏకంగా 12 కోట్ల రేంజ్ రేటు పలకడం విశేషం అనే చెప్పాలి. బాలయ్య సినిమాలు అంటే సీడెడ్ లో సాలిడ్ బిజినెస్ మొదటి నుండి మంచి రేట్లు పలుకుతాయి. ఈ సారి కూడా అదే జరిగినా ఈ సారి క్రేజ్ కూడా ఎక్కువగా ఉండటంతో సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here