Home న్యూస్ అఖండ రివ్యూ….మాస్ జాతర ఇది!!

అఖండ రివ్యూ….మాస్ జాతర ఇది!!

0

సింహా లెజెండ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ల తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ పై అంచనాలు అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా 1550 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఆడియన్స్ ను సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…. పేద ప్రజల కోసం ఆసుపత్రిలు కట్టించి ఫాక్షనిజాన్ని అరికట్టి ఊరిలో అందరి చేత వ్యవసాయం చేసిన బాలయ్య…ఊరి కలెక్టర్ అయిన హీరోయిన్ ముందు తప్పుగా అర్ధం చేసుకున్నా తర్వాత ప్రేమిస్తుంది…. మైనింగ్ పేరుతో యురేనియంని త్రవ్వే విలన్ శ్రీకాంత్….

వలన రేడియేషన్ పెరగడం, దాని వల్ల ఊర్లో చావులు పెరగడంతో అడ్డుకుంటాడు…. దాంతో హీరో మీద తప్పుడు కేసులు పెడతారు.. హీరో ఫ్యామిలీ ని అంతం చేయాలని చూస్తున్న టైం లో అఖండ అయిన మరో బాలయ్య రంగంలోకి దిగుతాడు, ఇంతకీ అఖండకి ఆ ఫ్యామిలీతో ఉన్న సంభందం ఏంటి… తర్వాత ఏం జరిగింది అన్నది అసలు సిసలు కథ…

బోయపాటి వేరే హీరోలతో ఎలాంటి కథలు తీసినా బాలయ్యతో మట్టుకు సింహా టెంప్లెట్ నే మళ్ళీ మళ్ళీ వాడుతున్నాడు… అది లెజెండ్ కి ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది, ఇక ఇప్పుడు అఖండకి కూడా ఇదే టెంప్లెట్ ని మరో విధమైన బ్యాగ్రౌండ్ తో వాడాడు…. ఫస్టాఫ్ వరకు మూడు ఫైట్ సీన్స్, జై బాలయ్య సాంగ్ హైలెట్స్ గా నిలిచినా…

కథ కొంచం వీక్ గానే ఉంటుంది, కానీ ఇంటర్వెల్ ఫైట్ భారీగా ఉన్న టైం లో అఖండ ఎంట్రీతో అసలు రచ్చ మొదలు అవుతుంది, ఇక సెకెండ్ ఆఫ్ లో ప్రతీ రెండు మూడు సీన్స్ కి ఓ ఎలివేషన్, ఓ యాక్షన్ సీన్ తో సీన్ బై సీన్ విలన్స్ పై దండయాత్ర మాస్ కి పూనకాలు తెప్పించేలా ఉంటాయి….

బాలయ్య 2 గెటప్స్ లో అదిరిపోయాడు, అఖండ రోల్ లో బాలయ్యని తప్ప మరేవ్వరీనీ కూడా ఊహించుకోలేం… తన డైలాగ్స్, యాక్షన్, స్కీన్ ప్రజెన్స్, హీరోయిజం సీన్స్ ఇలా ఒక్కటేంటి అన్నీ కూడా టాప్ నాట్చ్ అనిప్పించేలా ఉండగా హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించుకోగా, శ్రీకాంత్ విలనిజం రొటీన్ అయినా ఫస్ట్ టైం కాబట్టి ఫ్రెష్ గానే ఉంది.

జగపతిబాబు రోల్ కూడా బాగుంది, మిగిలిన యాక్టర్స్ చాలా మంది ఉన్న ఎవ్వరికీ అసలు డైలాగ్స్ లేవు, బొమ్మల్ల నిలబడతారు. ఇక తమన్ అందించిన పాటల్లో జై బాలయ్య అండ్ అఖండ కి రెస్పాన్స్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ఎక్కువ ఎలివేషన్ సీన్స్ ఉండటంతో తమన్….

రెచ్చిపోయి దుమ్ము లేపాడు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నాయి, సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి, ముఖ్యంగా అఖండ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. సినిమాటోగ్రఫీ అదిరిపోగా, ఫైట్స్ ని చాలా బాగా మాస్ కి నచ్చేలా డిసైడ్ చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండటం విశేషం అని చెప్పాలి.

ఇక బోయపాటి డైరెక్షన్ విషయానికి వస్తే సింహా, లెజెండ్ టెంప్లెట్ ని వాడినా ఈ సారి మాస్ డోస్ హద్దులు దాటిపోయే రేంజ్ లో పెంచాడు బోయపాటి, ఎలివేషన్లు, మాస్ సీన్స్ అసలు కొదవే లేదు సినిమాలో, కానీ లెజెండ్ లో సింహా లో సెకెండ్ ఆఫ్ లో కొంచం ఎమోషనల్ టచ్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా కొన్ని ఉండటం ఎక్కువ రీచ్ కి కారణం అయ్యాయి.

ఇక్కడ సెకెండ్ ఆఫ్ లో అలాంటి సీన్స్ కొరవ కనిపించింది. కానీ మాస్ ని టార్గెట్ చేసిన ఏ సీన్ కూడా అంచనాలను అందుకోవడం కాదు మించిపోయేలా ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా బాలయ్య బిగ్గెస్ట్ హైలెట్, బ్యాగ్రౌండ్ స్కోర్, 2 సాంగ్స్, ఎలివేషన్స్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ లాంటివి బిగ్గెస్ట్ హైలెట్స్ కాగా….

లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం, కథ ఈజీగా చెప్పే విధంగా ఉండటం లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్… కానీ ఇది ఫక్తు మాస్ మూవీ అని ముందే అందరికీ తెలుసు కాబట్టి మాస్ మూవీ చూడబోతున్నాం అంటూ థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతుంది… సినిమా మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here