నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వారాలను పూర్తీ చేసుకుని 7వ వారంలో అడుగు పెట్టగా ఇప్పటికీ సినిమా సాలిడ్ హోల్డ్ తో డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 వ రోజులో ఎంటర్ అవ్వగా సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్ తో బెటర్ హోల్డ్ ని సొంతం చేసుకుంటుంది.
కాగా సినిమా 44 వ రోజు కొన్ని సెంటర్స్ లో చాలా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కారణంగా సూపర్ మచ్చి సినిమాను తొలగించి ఆ షోలను అఖండకి కేటాయిస్తున్నారు. ఇది కొన్ని ఏరియాల్లో కనిపించగా ఓల్డ్ మూవీనే అయినా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా డీసెంట్ గా ఉండటం…
కొత్త సినిమాతో పోల్చుకున్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉండటంతో పండగ టైములో బాగా పెర్ఫార్మ్ చేయలేకపోతున్న కొత్త సినిమా సూపర్ మచ్చిని థియేటర్స్ నుండి తొలగించి మ్యాట్నీషోల నుండే అఖండని రిప్లేస్ చేస్తున్నారు. సినిమా ఈ వీకెండ్ లో తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ ని చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.