బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తీ అయినా కానీ ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు ని చూపెడుతూ దూసుకు పోతూనే ఉంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిపబ్లిక్ డే హాలిడే కూడా దొరకడంతో మళ్ళీ కొంచం షేర్ ని ఎక్కువగా సొంతం చేసుకోగా మరో పక్క డిజిటల్ రిలీజ్ అయినా కానీ సినిమా కి….
ఆడియన్స్ నుండి ఆదరణ లభిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలలో 63.17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 74.93 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ ఉండగా డిజిటల్ రిలీజ్ అయ్యాక సినిమా తమిళ్ డబ్బింగ్ వర్షన్ ని కూడా డిజిటల్ లో రిలీజ్ చేయాల్సింది కానీ సినిమా కి వస్తున్న ఆదరణ చూసి సడెన్ గా ఓ ట్విస్ట్ ఇస్తూ సినిమా ను అక్కడ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని…
నిర్ణయం తీసుకున్నారు మేకర్స్… సినిమా డిజిటల్ లో ఇప్పుడు తమిళ్ డబ్ వర్షన్ రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు 28న తమిళనాడు లో కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో అఖండ తమిళ్ డబ్బింగ్ వర్షన్ ని లిమిటెడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు… ఒకవేళ రెస్పాన్స్ బాగుంటే థియేటర్స్ ని పెంచే అవకాశం ఉందని సమాచారం…. తమిళ్ లో కన్నా కూడా…
ఎక్కువగా నార్త్ ఇండియా నుండి సినిమా ను థియేటర్స్ లో డబ్ చేసి రిలీజ్ చేయాలి అన్న డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ అక్కడ కన్నా ముందు ఇప్పుడు తమిళ్ లో సినిమా రిలీజ్ అవ్వడంతో రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. ఈ సడెన్ ట్విస్ట్ ని అయితే ఎవ్వరూ ఊహించలేదు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక.