Home న్యూస్ ఇదేమి మాస్ రా బాబు…తిప్పి కొడితే 11 రోజుల్లో నంబర్ 1…భీభత్సం ఇదీ!

ఇదేమి మాస్ రా బాబు…తిప్పి కొడితే 11 రోజుల్లో నంబర్ 1…భీభత్సం ఇదీ!

2216
0

    నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య వరుస ఫ్లాఫులలో ఉండొచ్చు, మరో పక్క బోయపాటి శ్రీను కూడా సరైనోడు సినిమా తర్వాత క్లీన్ హిట్ కొట్టకపోయి ఉండొచ్చు, కానీ బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వీళ్ళ కలయికలో రూపొందిన సినిమా అఖండ. ఈ సినిమా అన్నీ బాగుంటే సమ్మర్ కానుకగా…

ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ ఇప్పుడు కొంచం డిలే కానుంది, అయినా కానీ రీసెంట్ గా ఉగాది టైం లో సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ అలాగే సినిమాలో బాలయ్య సెకెండ్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన అఖండ ఇంట్రో టీసర్ ఓ రేంజ్ లో…

ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా, ఈ టీసర్ అల్టిమేట్ వ్యూస్ తో దూసుకు పోతూ టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచింది, దాంతో పాటే సౌత్ లో కూడా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచి రచ్చ చేసింది..

ఇక సౌత్ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ని సీనియర్ హీరోల క్యాటగిరీ లో సొంతం చేసుకున్న సినిమాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి సినిమా రికార్డ్ ను పట్టుమని 11 రోజుల్లో బ్రేక్ చేసి ఆల్ టైం సౌత్ లో ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచింది. కబాలి టీసర్ 37.8 మిలియన్స్ వ్యూస్ తో…

ఇన్ని రోజులు టాప్ లో ఉండగా 11 రోజుల్లో ఇప్పుడు అఖండ టీసర్ 38 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ఊరమాస్ అనిపించే స్పీడ్ తో సౌత్ లో నంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఇప్పుడు కొత్త బెంచ్ మార్కులు సెట్ చేయడానికి సిద్ధం అయిన ఈ టీసర్ ఇదే స్పీడ్ ని మెయిన్ టైన్ చేస్తే… టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కూడా నిలిచే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here