Home న్యూస్ 24 గంటలు ఓవర్…అల్లకల్లోలం సృష్టించిన అఖండ రికార్డ్!

24 గంటలు ఓవర్…అల్లకల్లోలం సృష్టించిన అఖండ రికార్డ్!

2564
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హాట్రిక్ మూవీ అఖండ కోసం అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఊహకందని రెస్పాన్స్ సొంతం అయ్యింది, అభిమానులను బాగా ఆకట్టుకున్న ఈ ట్రైలర్…

కామన్ ఆడియన్స్ కి కూడా బాగా రీచ్ ను సొంతం చేసుకుంది, బాలయ్య లుక్స్ డైలాగ్స్ అన్నీ అదిరిపోవడంతో అంచనాలు ఇంకా పెరిగి పోయాయి. ఇక ఈ ట్రైలర్ టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ మూవీ…

నారప్ప ట్రైలర్ 24 గంటల్లో 6.30 మిలియన్ వ్యూస్ ని మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా 341K లైక్స్ ని అందుకోగా ఈ రెండు రికార్డులను బ్రేక్ చేసింది అఖండ ట్రైలర్. వ్యూస్ పరంగా అయితే భారీ మార్జిన్ నే సెట్ చేసి పెట్టడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద అఖండ ట్రైలర్ 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి….

10.49 మిలియన్స్ వ్యూస్ ని అలాగే 351K లైక్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని సీనియర్ హీరోల పరంగా కొత్త రికార్డును సెట్ చేసి పెట్టింది. సీనియర్ హీరోలలో కొత్త రికార్డ్ నెలకొల్పడమే కాదు ఓవరాల్ గా ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న ట్రైలర్స్ లో టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకోగా…

లైక్స్ పరంగా కూడా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన అఖండ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను భారీగా పెంచింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అన్నది డిసెంబర్ 2 న తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here