Home TRP రేటింగ్ బ్లాక్ బస్టర్ అఖండ TRP రేటింగ్….లేట్ టెలికాస్ట్ అయినా కుమ్మిందిగా!!

బ్లాక్ బస్టర్ అఖండ TRP రేటింగ్….లేట్ టెలికాస్ట్ అయినా కుమ్మిందిగా!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి డిసాస్టర్ల తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన హాట్రిక్ మూవీ అఖండ ఆడియన్స్ ముందుకు డిసెంబర్ లో రాగా సినిమా పాండమిక్ తర్వాత ఫస్ట్ బిగ్ మూవీ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర…

కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ బాలయ్య ప్రీవియస్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన గౌతమీపుత్ర శాతకర్ణి కన్నా కూడా భారీ మార్జిన్ తో కొత్త కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

టోటల్ రన్ లో 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 21.10 కోట్ల ప్రాఫిట్ ని అందుకుని ఏకంగా 75.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో…

రికార్డ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది… ఇక రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది, కొంచం లేట్ టెలికాస్ట్ ను టెలివిజన్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి సారి స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయినప్పుడు సినిమాకి మొత్తం మీద 13.31 రేంజ్ లో TRP రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది… కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన విజయం దృశ్యా….

మినిమమ్ 16-18 రేంజ్ లో రేటింగ్ వస్తుంది అనుకున్నా లేట్ టెలికాస్ట్ వలన టి.ఆర్.పి రేటింగ్ ను మరీ అద్బుతంగా కాకున్నా ఉన్నంతలో మంచి రేటింగ్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సెకెండ్ టెలికాస్ట్ నుండి సినిమా కి మంచి లాభాలు కూడా టెలివిజన్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here