బాక్ టు బాక్ బాక్స్ అఫీస్ దగ్గర వరుస విజయాలతో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా రీసెంట్ గా అఫీషియల్ టీసర్ ను…
రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దానికి మించి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…తెలుగులో ఎలాగూ సీక్వెల్ ఫ్యాక్టర్ తో సినిమా మీద అంచనాలు ఓ లెవల్ లో ఉండగా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి…
సౌత్ లో ఇతర భాషల్లో అలాగే నార్త్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. హిందీ లో అయితే ఈ సినిమా డబ్ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే అక్కడ మాస్ రచ్చ చేసేది అని అందరూ అనుకున్నారు. దాంతో ఫస్ట్ పార్ట్ కి మిస్ అయినా…
సెకెండ్ పార్ట్ కి మాత్రం అక్కడ కూడా మాసివ్ రిలీజ్ ను ప్లాన్ చేయాలని చూస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా టీసర్ రిలీజ్ టైంలో హిందీ లో కూడా మాస్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టగా…టోటల్ నార్త్ లో సినిమా మేజర్ సెంటర్స్ లో భారీ లెవల్ లో…
పోస్టర్స్ ప్రమోషన్స్ చేశారట…భారీ లెవల్ లో పోస్టర్స్ ను పెట్టగా ఆ పోస్టర్స్ కోసమే ఏకంగా 1.55 కోట్ల రేంజ్ లో ఖర్చు అయ్యిందట. జస్ట్ టీసర్ ప్రమోషన్స్ కే ఈ రేంజ్ లో ఖర్చు చేయడం అందరినీ ఆశ్యర్యపరుస్తూ ఉండటం విశేషం, ఇక టీం కూడా హిందీలో భారీ ప్రమోషన్స్ ను చేయాలనీ చూస్తున్నారు…..
ఏమాత్రం అంచనాలను సినిమా అక్కడ అందుకున్నా ఇక్కడ ఏ రేంజ్ లో వసూళ్లు వస్తాయో అక్కడ ఒక్క చోటే ఆ కలెక్షన్స్ రచ్చ జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది బాలయ్య ఏ రేంజ్ లో దుమ్ము లేపుతాడో చూడాలి ఇక…