నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉండగా ఆల్ మోస్ట్ 4 సినిమాలుగా ఒక్క ఫ్లాఫ్ లేకుండా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ మాస్ రచ్చ చేయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారిన…
అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) ఆడియన్స్ ముందుకు త్వరలో రిలీజ్ కానుండగా రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు….
టీసర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరో రేంజ్ కి వెళ్ళాయి అని చెప్పాలి. అఖండ లో బాలయ్య లుక్ ని అలాగే ఈ సినిమాలో మరో న్యూ లుక్ ని ట్రై చేయగా రెండు లుక్స్ లో కూడా బాలయ్య మాస్ రచ్చ చేశాడు అనే చెప్పాలి. ఓవరాల్ గా బోయపాటి మాస్ టేకింగ్…
అడుగడుగునా మెప్పించగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ అంచనాలను మించి పోలేదు కానీ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ ను సెప్టెంబర్ 25న విజయదశమి వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు…
ఓవరాల్ గా టీసర్ మెప్పించిన రేంజ్ లో సినిమా కూడా మెప్పిస్తే కచ్చితంగా కలెక్షన్స్ పరంగా బాలయ్య కెరీర్ లో మొదటి 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అసలు లెక్కకు ఈ ఇయర్ డాకూ మహారాజ్ మూవీనే బాలయ్య కెరీర్ లో…
మొదటి 100 కోట్ల షేర్ మూవీ అవ్వాల్సింది మిస్ అయింది, సోలో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా ఆ మార్క్ ని అందుకునేదే..కానీ ఈ సారి అఖండ2 మీద అంచనాలు సాలిడ్ గా ఉండటంతో ఈ సారి టాక్ బాగుంటే మినిమమ్ 100 కోట్లతో స్టార్ట్ అయ్యే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇక…