Home గాసిప్స్ ఈ కాంబో సెట్ అయితే…అఖిల్ కి సాలిడ్ హిట్ పక్కా…కానీ!!

ఈ కాంబో సెట్ అయితే…అఖిల్ కి సాలిడ్ హిట్ పక్కా…కానీ!!

578
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు నికార్సయిన హిట్ ని సొంతం చేసుకోలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమా తో ఓపెనింగ్స్ దక్కినా కానీ అంచనాలను అందుకోలేక పోయిన సినిమా డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుని షాక్ ఇవ్వగా తర్వాత చేసిన హలో సినిమా కాంపిటీషన్ లో రిలీజ్ అవ్వడం తో టాక్ బాగున్నా బ్రేక్ ఈవెన్ కాలేక ఫ్లాఫ్ అయింది.

ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన మిస్టర్ మజ్ను ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపకుండానే డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న అఖిల్ తన ఆశలన్నీ…

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్ మీదే పెట్టుకున్నా కానీ ఇది కమర్షియల్ మాస్ మూవీ మాత్రం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి టైం లో ఇప్పుడు అఖిల్ కి ఓ మాస్ కమర్షియల్ మూవీ డైరెక్టర్ తో….

చేసే ఛాన్స్ పుష్కలంగా ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ ఇయర్ సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేయాలి అంటే మరో ఏడాది ఆగాల్సిన అవసరం ఉండగా బాలయ్య తో కూడా సినిమా చేయాల్సి ఉంది. కానీ దానికి కూడా కొంచం టైం పట్టేలా ఉండగా ఈ గ్యాప్ లో తక్కువ టైం లో…

ఓ సినిమా చేయాలి అని ప్లాన్ చేస్తూ అఖిల్ కి ఓ కథ చెప్పాడని టాలీవుడ్ టాక్, ఈ కథ కి అఖిల్ కూడా ఓకే అన్నట్లు అన్నాడని అంటున్నారు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే అఖిల్ కి బ్లాక్ బస్టర్ పక్కా అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాఫ్ లేకుండా అనిల్ రావిపూడి కెరీర్ కొనసాగిస్తున్నాడు. కానీ ప్రాజెక్ట్ ఓకే అవుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా డౌట్ గానే ఉందని టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here