Home న్యూస్ అమ్మింది 5 కోట్లకు…TRP రేటింగ్ “డిసాస్టర్”

అమ్మింది 5 కోట్లకు…TRP రేటింగ్ “డిసాస్టర్”

382
0

     అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన తొలి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వడం తో ఆశలన్నీ మూడో సినిమా పై పెట్టుకున్న అఖిల్ కి మూడో సినిమా కూడా ఊహించని షాక్ ఇచ్చింది, సినిమా ను 22 కోట్ల రేంజ్ లో అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో కేవలం 12.2 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె రాబట్టి ఫ్లాఫ్ గా పరుగును ముగించింది.

సినిమా రిలీజ్ కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకోవడం తో టాలీవుడ్ లీడింగ్ చానెల్స్ లో ఒకటి అయిన జీ తెలుగు వారు ఈ సినిమా ని ఏకంగా 5 కోట్ల రేటు ఇచ్చి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు ముగిసిన తర్వాత…

రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా TRP రేటింగ్ మాత్రం ఒకింత షాక్ నే కలిగించింది అని చెప్పాలి. అంతకు ముందు రిలీజ్ అయ్యి రెండో సారి టెలికాస్ట్ అయిన దేవదాస్ సినిమా రెండో సారి TRP రేటింగ్ ద్వారా 10.1 TRP రేటింగ్ ని సొంతం చేసుకోగా…

అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అనిపించే విధంగా కేవలం 5.6 TRP రేటింగ్ ని మాత్రమె దక్కించు కుని భారీ షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవ్వడం తో మినిమం 10 TRP రేటింగ్ అయినా వస్తుంది అనుకున్న చానెల్ కి ఒకింత షాక్ ఇచ్చిన మిస్టర్ మజ్ను.

అటు వెండి తెరపై ఫ్లాఫ్ అయ్యి ఇటు బుల్లి తెరపై కూడా డబుల్ ఫ్లాఫ్ అయ్యింది, ఇక అఖిల్ తన అప్ కమింగ్ మూవీ ని అతి త్వరలో నే మొదలు పెట్టె పనిలో ఉన్నాడు, మరి ఆ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here