Home గాసిప్స్ అఖిల్-సురేందర్ రెడ్డి….ఈ షాకింగ్ బడ్జెట్ ఏంటి సామి!

అఖిల్-సురేందర్ రెడ్డి….ఈ షాకింగ్ బడ్జెట్ ఏంటి సామి!

691
0

ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన అక్కినేని అఖిల్ 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేయగా ఈ సినిమా ఇప్పుడు వచ్చే సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగితే రిలీజ్ కాబోతుంది, ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారగా రేసు లో చాలా మంది డైరెక్టర్స్ ఉండగా ఫైనల్ గా ఇప్పుడు సురేందర్ రెడ్డి సీన్ లోకి వచ్చాడు.

కాగా సురేందర్ రెడ్డి తనదగ్గరుకున్న కథలను చాలా మంది హీరోలకు వినిపించినప్పటికీ ఫైనల్ గా అఖిల్ యెస్ చెప్పడం తో ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలి అనుకున్నారు. సురేందర్ రెడ్డి ముందు ఈ సినిమా ను వరుణ్ తేజ్ తో అనుకోగా క్రిష్ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది.

కానీ వరుణ్ తేజ్ కమిట్ అయిన మూవీస్ వల్ల తప్పుకోగా ఆ ప్లేస్ లో ఇప్పుడు అఖిల్ ఎంటర్ అవ్వగా సినిమా బడ్జెట్ గురించి రీసెంట్ గా డిస్కషన్స్ జరగగా ఈ సినిమా కి అవలీలగా 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ బడ్జెట్ అవసరం అని అనడంతో…

క్రిష్ ఈ అంత బడ్జెట్ అయితే కష్టం అని చెప్పగా సినిమా కి అంత బడ్జెట్ అవసరం అని సురేందర్ రెడ్డి ఫిక్స్ అవ్వడం తో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పుడు తప్పుకున్నారట. దాంతో అఖిల్ తో చేసే సినిమా కి ఇప్పుడు నిర్మాత ని వెతికే పనిలో పడ్డాడు సురేందర్ రెడ్డి. కింగ్ నాగార్జున… తన కొడుకుతో…

ఈ మూవీ నిర్మించే అవకాశం కూడా లేక పోలేదు అన్న టాక్ ఉన్నప్పటికీ అది కథని బట్టే డిసైడ్ అవుతుంది అంటున్నారు. అయినా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంటున్న ఈ కథ కి ఆ రేంజ్ బడ్జెట్ ఎందుకు అవసరం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే సినిమా పై మరిన్ని విషయాలు రివీల్ కాబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here