Home న్యూస్ అఖిల్ V వైష్ణవ్ తేజ్….ఏమవుతుందో ఇక!!

అఖిల్ V వైష్ణవ్ తేజ్….ఏమవుతుందో ఇక!!

945
0

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన మొదటి సినిమాకే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో సంచలనాలను సృష్టిస్తాడు అనుకున్న అఖిల్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ వరకు మ్యాజిక్ చూపినా సినిమా టాక్ పాజిటివ్ గా లేకపోవడం తో తర్వాత చేతులు ఎత్తేశాడు. ఇక తర్వాత సినిమాలతో అయినా హిట్ కొడతాడు అనుకుంటే తర్వాత చేసిన 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర…

నిరాశనే మిగిలించగా అదే టైం లో అఖిల్ ఫస్ట్ మూవీ రేంజ్ లో హైప్ ను సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ ఉప్పెన సాంగ్స్ తో విపరీతమైన హైప్ ను సొంతం చేసుకోవడం క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అవ్వడం అది కూడా సినిమా కి అల్టిమేట్ పబ్లిసిటీని…

తెచ్చి పెట్టడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా ఓపెన్ అయిన ఉప్పెన అఖిల్ సినిమా మిస్ అయిన రికార్డులను అన్నీ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… అలాంటి ఈ ఇద్దరూ నటించిన లేటెస్ట్ మూవీస్ ఇప్పుడు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పడటానికి సిద్దం అయ్యాయి.

అఖిల్ 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజా హెడ్గే హీరోయిన్ గా చేస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 లో ఈ సినిమాను రూపొందించారు. ఇక పంజా వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ల కాంబినేషన్ లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కొండపొలం సినిమా పై ఇప్పుడిప్పుడే అంచనాలు ఏర్పడుతూ ఉండగా…

ఈ రెండు సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజున పోటి పడబోతున్నాయి. అక్టోబర్ 8 న ఈ రెండు సినిమాలు దసరా కానుకగా వారం ముందే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇప్పటికీ మొదటి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఫస్ట్ హిట్ కొడతాడా లేక మొదటి సినిమా రేంజ్ లో విశ్వవ్ తేజ్ రెండో సినిమాతో మరోసారి సంచలనం సృష్టిస్తాడా అన్నది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here