యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju) నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi Movie) సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచం పర్వాలేదు అనిపించే అంచనాలను పెంచింది. మరి సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చాక ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే ఓ విలేజ్ లో 60 మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత హీరోయిన్ పుడుతుంది. హీరోయిన్ పుట్టిన తర్వాత ఊరికి అన్నీ కలిసి వస్తాయి…దాంతో హీరోయిన్ ఆ 60 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని రూల్ పెడతారు…ఈ క్రమంలో ఆ ఊరికి…
ఇంజనీరింగ్ పని మీద వచ్చిన హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కొత్త పాయింట్ తో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాజిక్ లు లాంటివి వెతకకుండా కామెడీ యాంగిల్ లో చూస్తె….
చాలా వరకు ఎంటర్ టైన్ చేసింది…సాంగ్స్ కూడా వినడానికి బాగుండగా ప్లేస్ మెంట్ కొంచం తప్పుగా ఉంది. ఫస్టాఫ్ వరకు కామెడీ పార్టు పార్టులుగా బాగానే వర్కౌట్ అవ్వడంతో మంచి టైం పాస్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కథ మాత్రం కొంచం స్లో డౌన్ అవ్వగా కొంచం సెంటిమెంట్ ని కూడా యాడ్ చేయడంతో…
ఫస్టాఫ్ ఇచ్చిన రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ సెకెండ్ ఆఫ్ క్యారీ చేయలేక పోయిన ఫీలింగ్ కలిగింది. కానీ సినిమా చాలా వరకు అంచనాలను తగ్గట్లే సాగడంతో సినిమా అయ్యే టైంకి ఒక డీసెంట్ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం ఖాయం…
ప్రదీప్ మాచిరాజు తన రోల్ వరకు బాగా నటించి మెప్పించాడు, కామెడీ కూడా పర్వాలేదు అనిపించగా హీరోయిన్ దీపిక పర్వాలేదు అనిపించింది, గెటప్ శ్రీను కామెడీతో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ ఓకే.. సంగీతం సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది, ఫస్టాఫ్ ను డీల్ చేసినట్లే సెకెండ్ ఆఫ్ కూడా కామెడీ టెంపో తగ్గకుండా చూసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది… అయినా కూడా పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ బాగానే ఇంప్రెస్ చేసే అవకాశం ఉంది… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…