బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ ఎఫెక్ట్ కనిపించడం మొదలు అయింది, ఫిబ్రవరి ని అన్ సీజన్ గా భావిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే, కానీ పాండమిక్ తర్వాత వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా ఉప్పెన అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించి ఫిబ్రవరి అన్ సీజన్ అన్నది కూడా చూడకుండా దుమ్ము లేపగా మిగిలిన సినిమాలు కొన్ని బాగానే ఓపెనింగ్స్ ని సాధించాయి. నెల ఎండ్ కి వచ్చే సరికీ…
ఎక్స్ పెరిమెంటల్ మూవీ చెక్ యావరేజ్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టగా అదే రోజు రిలీజ్ అయిన మరో నోటబుల్ చిన్న సినిమా అక్షర సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందా అని అంతా అనుకోగా సినిమా ఓపెనింగ్స్ అందరినీ…
తీవ్రంగా నిరాశ పరిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని తీవ్ర నిరాశ పరిచిన ఈ సినిమా రెండో రోజు కూడా ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ ని చూపలేక పోయింది. అన్ని సెంటర్స్ లో మరోసారి డెఫిసిట్ లు…
నెగటివ్ షేర్స్ తో సినిమా మినిమమ్ కలెక్షన్స్ ని కూడా సాధించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర జీరో షేర్ ని సొంతం చేసుకుని రెండు రోజులను పూర్తీ చేసుకుంది, రీసెంట్ టైం లో ఊరు పేరు లేని సినిమాలు కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా.. ఈ సినిమా విషయానికి వచ్చే సరికి ఇలాంటి రిజల్ట్ దక్కడం నిజంగానే దారుణం అని చెప్పాలి.
అన్ సీజన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిందని ఇప్పుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ అదే టైం లో ఉప్పెన ఇంకా కలెక్షన్స్ ని సాధిస్తుంది. కానీ కొత్త సినిమాలకు మాత్రం ఈ ఇబ్బంది ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక అక్షర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నెట్ ఫ్రీ గా, పెర్సేంటేజ్ బేస్ మీద రన్ అవుతుంది. మరి ఏమైనా కలెక్షన్స్ వస్తాయో రావో చూడాలి ఇక..