Home న్యూస్ ఓ చిన్న సినిమా చేతిలో ఓడిపోయిన అక్షయ్ కుమార్ సినిమా…బాలీవుడ్ షాక్!

ఓ చిన్న సినిమా చేతిలో ఓడిపోయిన అక్షయ్ కుమార్ సినిమా…బాలీవుడ్ షాక్!

1352
0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ నుండి ఆల్ మోస్ట్ ఏడాదిన్నర టైం లో రిలీజ్ కి సిద్ధమైన పెద్ద హీరో నటించిన సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం సినిమా… ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ల తర్వాత ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే రిలీజ్ అయిన పెద్ద హీరో సినిమా ఇదే అవ్వడం జనాలు మరీ భారీగా కాకున్నా మోస్తరుగా అయినా థియేటర్స్ కి…

వస్తారు అనుకున్నా కానీ అసలు జనాలు ఏ దశలో కూడా థియేటర్స్ లో అడుగు పెట్టే మూడ్ లో లేరని సినిమా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ తో తేట తెల్లం అయింది.. సినిమా కేవలం 17.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని ముగించగా ఇప్పుడు…

రెండో వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు బాలీవుడ్ తరుపున లాస్ట్ ఏడాదిన్నరగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలలో రెండో అత్యధిక నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న….

బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఈ ఇయర్ లో హిందీ లో జాన్వి కపూర్ మెయిన్ లీడ్ లో నటించిన రూహి అనే హర్రర్ కామెడీ మూవీ టోటల్ రన్ లో 22 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా ఆ సినిమా తో పోల్చుకుంటే భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకున్న బెల్ బాటం మొదటి వారంలోపే ఈ కలెక్షన్స్…

దాటుతుంది అనుకున్న అతి కష్టం మీద ఇప్పుడు రెండో వీక్ పూర్తీ అయ్యే టైం కి దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఓవరాల్ గా ఓ చిన్న సినిమా ను కూడా దాటడానికి కష్టాలు పడుతున్న బెల్ బాటం పరిస్థితి చూస్తుంటే బాలీవుడ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here