Home న్యూస్ బెల్ బాటం మినీ రివ్యూ…హిట్టా-ఫట్టా!!

బెల్ బాటం మినీ రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

ఆల్ మోస్ట్ ఏడాదిన్నర తర్వాత బాలీవుడ్ నుండి ఆడియన్స్ ముందుకు వచ్చిన బిగ్ హీరో మూవీ బెల్ బాటం, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి సాలిడ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి సినిమా జనలాను తిరిగి థియేటర్స్ కి రప్పించేంత కెపాసిటీ ఉందా లేదా తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ విషయానికి వస్తే రా ఏజెంట్ అయిన అక్షయ్ కుమార్ 1980 టైం లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న టైం లో హైజాక్ అయిన ఒక ఫ్లైట్ ని తిరిగి క్షేమంగా ఇండియాకి తిరిగి తీసుకువచ్చే భాద్యతని అక్షయ్ కుమార్ కి అప్పగిస్తారు. మరి అక్షయ్ కుమార్ ఎలా…

ఆ ఫ్లైట్ ని క్షేమంగా ఇండియాకి తీసుకు రాగలిగాడు, ఈ క్రమంలో ఎలాంటి ఎదురుదెబ్బలు ఎదురు అయ్యాయి లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రేసీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా చాలా తక్కువ చోట్ల మాత్రమే డల్ మూమెంట్స్ ఉంటాయి. అక్షయ్ కుమార్ తన పెర్ఫార్మెన్స్ తో చెడుగుడు ఆడేసుకున్నాడు.

హీరోయిన్ వాని కపూర్ కూడా మెప్పించగా ఆ పాత్రకి ఇచ్చిన ఓ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక లారాదత్త రోల్ కూడా మెప్పించాగా ఓవరాల్ సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి పెద్దగా టైం ఏమి పట్టాడు. సినిమా ఓపెన్ అవ్వడమే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి అది సినిమా ఎండ్ అయ్యే వరకు ఆ ఫ్లో మిస్ అవ్వకుండా అదే జోరుని మెయిన్ టైన్ చేస్తుంది. అక్కడక్కడా కొంచం అక్షయ్ కుమార్ ఇది వరకు చేసిన బేబీ సినిమా పోలికలు ఉన్నా…

ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఈ సినిమా, అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్ కోసం, భారీ విజువల్స్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు. సినిమా కి బాలీవుడ్ జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పించే సత్తా కచ్చితంగా ఉంది, మరి సినిమా చూడటానికి జనాలు ఎంతవరకు వస్తారో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here