పరిస్థితులు నార్మల్ అవుతున్నాయి అనుకుంటే సడెన్ గా ఎదో ఒక ఎదురు దెబ్బ పడుతూనే ఉంది, లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ దెబ్బకి అన్ని ఇండస్ట్రీలు అతలాకుతలం అవ్వగా ఎలాగోలా సౌత్ ఇండస్ట్రీ ఈ ఇయర్ మొదట్లో తెరుకున్నట్లు అనిపించగా బాలీవుడ్ మాత్రం లాస్ట్ ఇయర్ నుండి కోలుకోవడానికి ట్రై చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక పరిస్థితులు ఈ ఇయర్ నార్మల్ అవుతున్నాయి అనుకుంటే ఇంతలో సెకెండ్ వేవ్ దెబ్బ మరింత గట్టిగా తాకింది.
దాంతో అన్ని ఇండస్ట్రీల పరిస్థితి ఆల్ మోస్ట్ మళ్ళీ మొదటికి వచ్చేయగా బాలీవుడ్ ఇంకా నష్టపోతూనే ఉండగా ఎట్టకేలకు థియేటర్స్ ని రీసెంట్ గా తిరిగి అన్ని చోట్లా మెళ్లి మెల్లిగా తెరుస్తూ ఉండగా బాలీవుడ్ మూవీస్ మళ్ళీ ఆడియన్స్ ముందుకు ఒకటి తర్వాత ఒకటి…
రిలీజ్ ను సొంతం చేసుకుంటాయి అనుకున్నా ఒక్క సినిమా కూడా ముందుకు రాని టైం లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ బెల్ బాటం ను ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో జులై 27 న తీసుకు రావాలని ఫిక్స్ అయ్యి అనౌన్స్ మెంట్ ని రీసెంట్ గా చేశారు.
సినిమా కి డిజిటల్ రిలీజ్ కి సాలిడ్ రేటు ఆఫర్ చేసినప్పటికీ కూడా బాలీవుడ్ తరుపున లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న బిగ్గెస్ట్ మూవీ గా మారబోతున్న బెల్ బాటం కి ఇప్పుడు మళ్ళీ సడెన్ గా ఎదురు దెబ్బ తగలడం మొదలు అయ్యింది. మహారాష్ట్రలో కేసులు మళ్ళీ పెరుగుతూ ఉండటం తో థియేటర్స్ ని…
మళ్ళీ మూసేశారు చాలా చోట్ల, అలాగే నార్త్ లో చాలా చోట్ల ఇప్పటికీ థియేటర్స్ అసలు ఓపెన్ కాలేదు, ఈ నెల ఎండ్ కి ఓపెన్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువే, దాంతో అన్ని చోట్ల థియేటర్స్ ఓపెన్ అవ్వనిది సినిమా రిలీజ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న డౌట్ లో ఇప్పుడు టీం పడినట్లు తెలుస్తుంది. మరో వారం 10 రోజులు పరిస్థితులు ఇలానే ఉంటే సినిమా రిలీజ్ ఆగే అవకాశం ఉందని అంటున్నారు.