Home న్యూస్ ఎపిక్ డిసాస్టర్లు….నేనేమి చచ్చిపోలేదు అంటున్న ఖిలాడీ!!

ఎపిక్ డిసాస్టర్లు….నేనేమి చచ్చిపోలేదు అంటున్న ఖిలాడీ!!

0

 

 

 

హిట్లు ఫ్లాఫ్స్ అనేవి ఎవ్వరి చేతిలో కూడా ఉండవు….సినిమాలు చేస్తూ ఉంటే వాటిలో కొన్ని అంచనాలను అందుకుంటాయి, కొన్ని సినిమాలు అంచనాలు అందుకోవు….కానీ మరీ ఎక్కువగా సినిమాలు అంచనాలను అందుకోకపోతే మాత్రం సినిమాల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది…

కానీ ఆ విషయంలో అనుకున్న రేంజ్ లో శ్రద్ధ చూపని వాళ్ళు కూడా ఉంటారు. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) విషయంలో ఇదే జరుగుతుంది. ప్రీ కోవిడ్ టైంలో వరుస పెట్టి హిట్స్ కొట్టినా కూడా కోవిడ్ తర్వాత మాత్రం వరుస పెట్టి నిరాశ కలిగించే….

రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉండగా వాటిలో సేఫ్ సైడ్ లో బెస్ట్ అనిపించుకుంటున్న రీమేక్ లు మరింత నిరాశ పరుస్తూ ఉండగా రీసెంట్ గా 150వ సినిమాను పూర్తి చేసుకోగా ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది….బాక్ టు బాక్ ఈ ఏడాది చేసిన 3 సినిమాలు…

ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకోగా మళ్ళీ తన కొత్త సినిమా ఖేల్ ఖేల్ మే త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ప్రెస్ తో మాట్లాడటానికి వచ్చిన అక్షయ్ కుమార్ ను అందరూ వరుస ఫ్లాఫ్స్ గురించి అడగగా…నాకు వరుస పెట్టి మెసేజ్ లు వస్తున్నాయని…సారి…అంతా సెట్ అవుతుందని…

అంటూ కామెంట్స్ వస్తూ ఉన్నాయని…కానీ నేను చచ్చిపోలేదు బ్రతికే ఉన్నానని….నేను సంపాదించే ప్రతీ రూపాయి నా కష్టంతోనే సంపాదించానని చెబుతూ కొంచం సీరియస్ అయ్యాడు…కానీ ఇక్కడ హీరో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే రీమేక్ లు వర్కౌట్ అవ్వడం లేదు అని…

రెండు మూడేళ్ళ నుండి వస్తున్న రిజల్ట్ లు చూసి అర్ధం చేసుకోవచ్చు. అయినా రీమేక్ లు ఆపలేదు…అలాగే తక్కువ గ్యాప్ లో ఎలాంటి వరుస పెట్టి సినిమాలు వస్తూ ఉండటంతో జనాలు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు…కానీ అది గమనించక ఫ్లాఫ్స్ తనకి కొత్త కాదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పాలి…

జనాలు అక్షయ్ కుమార్ నుండి కోరుకునేది ఒకప్పటి కామెడీ ఎంటర్ టైనర్ లు…అలాగే ఎయిర్ లిఫ్ట్, బేబీ లాంటి కొత్త రకం సబ్జెక్ట్ లు..కానీ అక్షయ్ రీసెంట్ మూవీస్ మరీ రొటీన్ అవ్వడం వలనే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పొచ్చు. ఇక తన అక్షయ్ కుమార్ సినిమాలతో ఎంతవరకు కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here