రీసెంట్ టైం లో ఏ సినిమా పైన అన్న ఓ రేంజ్ లో వ్యతిరేకత వచ్చిందీ అంటే అది కచ్చితంగా ఆలియా భట్, సంజయ్ దత్ మరియు ఆదిత్య రాయ్ ల కాంబినేషన్ లో మహేష్ భట్ డైరెక్షన్ లో తెరకెక్కిన సడక్ 2 సినిమా పైనే అని చెప్పాలి. సుశాంత్ మరణం తర్వాత నెపో కిడ్స్ పై అందరూ వ్యతిరేకంగా ఉండటం, ఈ సినిమా నిండా వాళ్ళే ఉండటం తో ఎఫెక్ట్…
అనుకున్న లెవల్ కి మించిపోయింది, వరల్డ్ మోస్ట్ డిస్ లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ గా రిలీజ్ అయిన తర్వాత డిసాస్టర్ టాక్ ని కూడా తెచ్చుకున్న ఈ సినిమా IMDB రేటింగ్స్ లో కేవలం 1 స్టార్ రేటింగ్ తో అత్యల్ప రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది.
అయినా కానీ ఇన్ని అవరోధాలను ఎదురుకున్నా కానీ సినిమా తో నిర్మాతలకు భారీ లాభాలు దక్కాయి అనే చెప్పాలి. సినిమా మొత్తం లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కించగా సినిమా కి టోటల్ గా 35 కోట్ల రేంజ్ బడ్జెట్ అవ్వగా సినిమాను డిజిటల్ రిలీజ్ కి గాను 65 కోట్లకుఅమ్మి ఇక్కడే 30 కోట్ల మేర ప్రాఫిట్ ని సాధించారు.
ఇక సినిమా మ్యూజిక్ రైట్స్ ని 5.5 కోట్ల రేటు కి, అలాగే సినిమా శాటిలైట్ రైట్స్ ని 30 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ బిజినెస్ లెక్క 100.5 కోట్ల మార్క్ ని అందుకుంది, సినిమా కి టోటల్ గా పెట్టిన బడ్జెట్ 35 కోట్లు అలాగే పబ్లిసిటీ కోసం ఖర్చు చేసిన 5 కోట్లు కూడా కలిపినా కానీ..
ఈ సినిమా తో నిర్మాతకి ఏకంగా 60 కోట్లకు పైగా లాభం దక్కింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె కలెక్షన్స్ ఆ రేంజ్ లో వచ్చి ఉండేవి కాదు కానీ ముందే మంచి రేటు కి సినిమాని అమ్మడం తో నిర్మాత కి టాక్ కి బయట గొడవకి అతీతంగా భారీ లాభాలు సొంతం అయ్యాయి ఈ సినిమా వల్ల…