బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ నాంది సినిమాతో ఈ ఇయర్ ఎట్టకేలకు కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు, కానీ అంతకుముందు వచ్చిన సినిమాలు ఏవి కూడా ఆశించిన అంచనాలను అందుకోలేక పోయాయి. చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశని మిగిలించగా ఈ ఇయర్ సంక్రాంతి తర్వాత ఆడియన్స్ ముందుకు బంగారు బుల్లోడు సినిమా తో అల్లరి నరేష్ హిట్ కొట్టాలని ట్రై చేశాడు. సినిమా కి మాత్రం…
పాజిటివ్ రాలేదు… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద 3.5 కోట్ల బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 1.95 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని 1.55 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని డిసాస్టర్ అయ్యింది.
అయినా కానీ సినిమా బిజినెస్ పరంగా కొంచం బెటర్ శాటిలైట్ రైట్స్ డీల్ ను సొంతం చేసుకుంది, ముందు 1.5 కోట్లు అనుకున్నా తర్వాత రేటు పెరిగి 1.8 కోట్ల రేటు కి సినిమా శాటిలైట్ రైట్స్ ని అమ్మగా సినిమా కి మంచి రేటింగ్ వస్తుందని ఛానెల్ ఆశించింది…
కానీ అలా జరగలేదు. సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు పోటిగా ఇతర చానెల్స్ లో కూడా వరుస పెట్టి సినిమాలు ఉండటం తో ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఈ సినిమా పై పడింది. దాంతో ఈ సినిమా కి మొత్తం మీద 2.41 TRP రేటింగ్ మాత్రమే సొంతం అయ్యింది అని చెప్పాలి. ఒక పక్క కొన్ని డబ్బింగ్ సినిమాలు 30-50 లక్షల రేంజ్ రేటు కే 4-6 రేంజ్ లో…
TRP రేటింగ్ లు సొంతం చేసుకుంటున్నాయి. అదే టైం లో తెలుగు సినిమాలు మంచి రేట్లు సొంతం చేసుకున్నా కానీ TRP రేటింగ్ లు అంతంతమాత్రమే వస్తున్నాయి. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన బంగారు బుల్లోడు టెలివిజన్ లో కూడా ఫ్లాఫ్ రేటింగ్ నే సాధించింది. ఇక కంబ్యాక్ మూవీ నాంది కి ఎలాంటి రేటింగ్ సొంతం అవుతుందో చూడాలి.