Home న్యూస్ చరిత్ర్ర చింపేసిన అల్లు అర్జున్…ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డ్ ఇదీ!

చరిత్ర్ర చింపేసిన అల్లు అర్జున్…ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డ్ ఇదీ!

1512
0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప రికార్డుల వర్షం ఏమాత్రం ఆగడం లేదు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ ను రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా అప్పటి నుండే సంచలన రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ ఇంట్రో టీసర్ స్టార్టింగ్ లో కొన్ని రికార్డులు మిస్ చేసుకున్నా తర్వాత…

24 గంటల్లో సంచలన రికార్డులను నమోదు చేసింది, తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా ఫాస్టెస్ట్ రికార్డుల వేటని అలానే మెయిన్ టైన్ చేస్తూ వచ్చిన పుష్ప టీసర్ టాలీవుడ్ లో మరిన్ని రికార్డులను సృష్టించగా ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం ఫాస్టెస్ట్ మైల్ స్టోన్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 50 మిలియన్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ లో ఫస్ట్ 50 మిలియన్ టీసర్ గా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు పుష్ప ఇంట్రో టీసర్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సరికొత్త సంచలన రికార్డ్ ను…

నమోదు చేసి ఊచకోత కోసింది. మొత్తం మీద 20 రోజుల రేంజ్ లో టైం తీసుకుని 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని ఫాస్టెస్ట్ రికార్డ్ తో దుమ్ము దుమారం చేయగా ప్రస్తుతానికి టాలీవుడ్ నుండి 50 మిలియన్ మార్క్ ని అందుకున్న టీసర్ లు ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ల లేటెస్ట్ మూవీస్ ఇంట్రో టీసర్ లు నిలిచాయి.

అల్లు అర్జున్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ రికార్డులను సృష్టించి ఫాస్టెస్ట్ రికార్డులతో దుమ్ము దుమారం చేసింది. ఇప్పటికీ సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ టీసర్ లాంగ్ రన్ లో మరిన్ని మైల్ స్టోన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. 50 మిలియన్ వ్యూస్ కి 1.2 మిలియన్స్ లైక్స్ ని కూడా సొంతం చేసుకుంది ఈ టీసర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here