“అల్లుఅర్జున్” తప్పించుకున్నాడు “ఎన్టీఆర్” బలయ్యాడు

0
1154

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు 28 సినిమా ల్లో నటించ గా అందు లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచిన సినిమాల్లో ముందు వరుస లో నిలిచే చిత్రం శక్తి. మగధీర సినిమా చూశాక ఇలాంటి సినిమా చేయాలి అని ఫిక్స్ అయిన యంగ్ హీరో లను టార్గెట్ చేసుకున్న దర్శకుడు మెహర్ రమేష్ ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసు కుని ఇద్దరు స్టార్స్ కి విని పించాడు.

ఆ ఇద్దరు స్టార్స్ మరెవ రో కాదు ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరి కీ మార్చి మార్చి ఈ స్క్రిప్ట్ ని వినిపించిన రమేష్ ముందు గా ఈ సినిమా ను ఎలా గైనా అల్లుఅర్జున్ తోనే చేయాలి అని అను కున్నా డట.

అందుకు గాను గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తోనూ మంతనాలు జరిపాడట. కాని అప్పటికే మగధీర లాంటి విజయాన్ని తన కుమారుడికి ఇవ్వాలని ఫిక్స్ అయిన అల్లు అరవింద్ వినాయక్ దర్శకత్వం లో బద్రినాథ్ కి శ్రీకారం చుట్టాడు. దాంతో మెహర్ రమేష్ చేసేది ఏమి లేక

ఎన్టీఆర్ ని ఎలా గోలా ఒప్పించి శక్తి సినిమాను తెరకెక్కించాడు. సుమారు 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ గా 20 కోట్లలోపే కలెక్ట్ చేసి డిసాస్టర్ గా మిగిలింది. ఆ విధంగా మెహర్ రమేష్ చేతిలో నుండి అల్లుఅర్జున్ సేఫ్ అయ్యాడు పాపం ఎన్టీఆర్ బలయిపోయాడు.

తర్వాత కెరీర్ లో ఒకటి రెండు ఇతర ఫ్లాఫులను మూట గట్టుకున్న ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుండి ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో అపజయం అంటే తెలియకుండా 5 సినిమాలుగా ఫ్యాన్స్ ని అలరిస్తూ దూసుకు పోతున్నాడు, ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి RRR లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!