Home న్యూస్ ఇండియాలో సెకెండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టిన హీరోతో అల్లు అర్జున్ పోటి!

ఇండియాలో సెకెండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టిన హీరోతో అల్లు అర్జున్ పోటి!

2787
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠ పురం లో సినిమా అల్టిమేట్ విజయం తో టాలీవుడ్ లో నాన్ బాహుబలి బిగ్గెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న రికార్డ్ తో ఫుల్ జోష్ లో ఉండగా అల వైకుంఠ పురం లో సినిమా తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న కొత్త సినిమా పుష్ప ముందు ఒకే పార్ట్ అనుకున్నా తర్వాత రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

Ala VaikunthaPurramuloo 50 Days Centers List

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమాలోని అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇంట్రో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సంచలనాలను సృష్టించిందో యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులను…

క్రియేట్ చేసి టాలీవుడ్ తరుపున కొత్త బెంచ్ మార్కులను సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఈ నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన ఓపెనింగ్స్ తో దుమ్ము లేపాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన అది జరగలేదు.

కానీ రీసెంట్ గా సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్ కి ఇండియాలో బాహుబలి తర్వాత సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సినిమా తో పోటి పడబోతుంది పుష్ప పార్ట్ 1 సినిమా. ఈ క్రిస్టమస్ కి సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ రీసెంట్ గా పోస్టర్ తో అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో క్రిస్టమస్ సీజన్ అంటే అమీర్ ఖాన్ దే…

5 ఏళ్ల క్రితం దంగల్ సినిమాతో చివరి సారి క్రిస్టమస్ కి వచ్చిన అమీర్ ఆ సినిమా తో 374 కోట్ల నెట్ కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. బాలీవుడ్ మూవీస్ ఇప్పటికీ ఆ రికార్డ్ ను అందుకోలేదు. ఇప్పుడు కరీనాకపూర్ హీరోయిన్ గా నాగ చైతన్య స్పెషల్ రోల్ లో చేస్తున్న లాల్ సింగ్ చడ్డా ఈ క్రిస్టమస్ కి రిలీజ్ కానుంది. మరి అమీర్ ఖాన్ తో పోటి పడబోతున్న పుష్ప పార్ట్ 1 తో అల్లు అర్జున్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here