బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అల వైకుంఠ పురంలో సినిమా తో రీజనల్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ ను అందుకోగా తర్వాత పుష్ప తో సెన్సేషనల్ పాన్ ఇండియా సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు… ఇక ఆ సినిమా సీక్వెల్ అయిన…
పుష్ప2 సినిమాతో అయితే ఏకంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను దక్కించుకోగా…ఈ సినిమాలు అన్నీ కూడా డిజిటల్ లో కుమ్మేయడమే కాదు తర్వాత టెలివిజన్ కూడా వీర లెవల్ లో కుమ్మేసి సంచలనం సృష్టించాయి.
అల వైకుంఠ పురంలో టెలివిజన్ లో టాలీవుడ్ తరుపున ఆల్ టైం రికార్డ్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన పుష్ప సినిమా ఊరమాస్ మూవీ నే అయినా ఎక్స్ లెంట్ రేటింగ్ తో కుమ్మేసింది కానీ ఆ తర్వాత వచ్చిన పుష్ప2 మూవీ మాత్రం…
బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన రిజల్ట్ కి మాత్రం సంభందం లేని రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది. కానీ అల్లు అర్జున్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా టెలివిజన్ లో ఎక్స్ లెంట్ రేటింగ్స్ ను సొంతం చేసుకున్నాయి…
ఒకసారి ఆ సినిమాల రేటింగ్ లను గమనిస్తే…
#AlluArjun Recent Movies 1st Time TRP Ratings
👉#Pushpa2- 12.61 TRP*****
👉#PushpaTheRise – 22.54 TRP
👉#AlaVaikunthapurramuloo – 29.4 TRP
👉#NaaPeruSurya – 12 TRP
👉#DJ- 21.7 TRP
అట్టర్ ఫ్లాఫ్ అయిన నా పేరు సూర్య కూడా అప్పట్లో 12 రేటింగ్ ను అందుకోగా ఇప్పుడు రికార్డులు తిరగరాసిన పుష్ప2 కొంచం అదే రేంజ్ లో రేటింగ్ ను అందుకోగా మిగిలిన సినిమాలు మాత్రం సాలిడ్ రేటింగ్స్ తో మాస్ రచ్చ చేశాయి. ఇక లాంగ్ రన్ లో పుష్ప2 ఎలాంటి రేటింగ్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి…