కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అల వైకుంఠ పురంలో(ala vaikunthapurramuloo) మరియు పుష్ప(Pushpa The Rise) తో బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా తెలుగు లో….
కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా హిందీలో ఇతర భాషల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు పుష్ప2(Pushpa The Rule) తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా తర్వాత ఏ సినిమాను…
అఫీషియల్ గా అయితే కమిట్ అవ్వలేదు కానీ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీస్ డైరెక్టర్స్ లో అందరి కన్నా ముందు నిలుస్తూ ఇద్దరు కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ రేసులో ముందు ఉన్నారు… ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో జైలర్(Jailer Movie) లాంటి…
బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ కాగా మరొకరు ప్రస్తుతం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తో జవాన్(Jawan Movie) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ…ఈ ఇద్దరు రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి స్టోరీలను వినిపించారని సమాచారం.
నెల్సన్ రీసెంట్ గా కథని వినిపించగా ఈ ఇద్దరిలో ఒకరితో అల్లు అర్జున్ తర్వాత సినిమా ఉండవచ్చు అని స్ట్రాంగ్ బజ్ అయితే ఉందని చెప్పాలి. మరి అల్లు అర్జున్ ఫైనల్ గా ఎవరితో మూవీ కన్ఫాం చేస్తాడో చూడాలి. తమిళ్ లో కూడా అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉండటం…
మలయాళంలో కూడా క్రేజ్ ఉండటంతో పెర్ఫెక్ట్ గా ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా రేంజ్ లో మరో మంచి ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మరి అల్లు అర్జున్ ఎవరితో మూవీ కన్ఫాం చేస్తాడో లేక మరే డైరెక్టర్ తో సినిమా ఓకే చేస్తాడో చూడాలి.