ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో క్లాస్ కంటెంట్ తో తెరకెక్కిన సుదీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో కంప్లీట్ గా విఫలం అయింది.. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ చూపించలేక పోయిన ఈ సినిమా వీకెండ్ కే చేతులు ఎత్తేయగా వర్కింగ్ డేస్ లో ఆల్ మోస్ట్ వాషౌట్ అయ్యే స్టేజ్ కి వచ్చింది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయంగా మారింది అని చెప్పాలి. కాగా ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 13 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను కేటాయించారట. ఈ క్లాస్ కంటెంట్ ఆడియన్స్ కి నచ్చుతుంది అనుకున్నా కానీ..
అలాంటిది ఏమి జరగలేదు…. సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాక పోవడంతో మేకర్స్ అడ్వాన్స్ బేసెస్ తో సినిమాను రిలీజ్ చేశారు. ఆ బిజినెస్ వాల్యూ 5.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… బిజినెస్ లేదు అనుకున్నా బడ్జెట్ 13 కోట్లలో డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో పాటు…
డబ్బింగ్ రైట్స్ కలుపుకుని 6-7 కోట్ల దాకా రికవరీ అయ్యిందని టాక్ వినిపిస్తూ ఉండగా థియేట్రికల్ రన్ లో కోటి షేర్ కూడా డౌట్ గానే మారడంతో సినిమా కి ఆల్ మోస్ట్ 5 కోట్లకి తగ్గని లాస్ నిర్మాతకి సొంతం అయ్యాయి అంటూ టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇది నిజంగానే మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ అని చెప్పాలి.