Home న్యూస్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

గజినీ, 3 ఇడియట్స్, పీకే మరియు దంగల్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్(Amir Khan) తర్వాత టైంలో హిట్స్ కి దూరం అయ్యాడు….తన సినిమాలు అంటే ఒకప్పుడు ఆడియన్స్ లో ఉండే ఆసక్తి తగ్గిపోగా కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు సితారే జమీన్ పర్(Sitaare Zameen Par Movie) తో…

ఆడియన్స్ ముందుకు వచ్చిన అమీర్ ఖాన్ ఈ సారి ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే కొంచం షార్ట్ టెంపర్ అయిన బాస్కెట్ బాల్ కోచ్ అయిన హీరో లైఫ్ లో జరుగుతున్న పరిస్థితుల వలన కొన్ని తప్పులు చేస్తాడు..

దాంతో తనని కొంత టైం వరకు మెంటల్లీ చాలెంజుడ్ బాస్కెట్ బాల్ టీం కి కోచ్ గా వెళ్లాలని కండీషన్ పెట్టడంతో తప్పక అక్కడికి వెళ్ళే హీరో ఏం చేశాడు, కోచింగ్ చేస్తూ వాళ్ళతో ఎలా కలిసిపోయాడు…ఎలా మారాడు అన్నది మొత్తం మీద స్టోరీ పాయింట్….

అమీర్ ఖాన్ పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్స్ లెంట్ యాక్టింగ్ తో మెప్పించగా ఇలాంటి రోల్స్ తనకి కొట్టిన పిండి అనే చెప్పాలి. లైట్ కామెడీ సీన్స్, హార్ట్ టచింగ్ సీన్స్ తో సినిమా బాగానే సాగినా కూడా తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది ఈజీగా గెస్ చేసేలా ఉండటం సినిమా మేజర్ డ్రా బ్యాక్…

అండ్ కథ కూడా మరీ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది…ఇవి రెండు తప్పితే మేజర్ గా మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేవు, అమీర్ నటన, సినిమా క్లైమాక్స్, లైట్ కామెడీ సీన్స్ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా…

ఓవరాల్ గా రీసెంట్ అమీర్ ఖాన్ మూవీస్ మీద చాలా బెటర్ మూవీ అనే చెప్పాలి. కానీ అదే టైంలో 3 ఇడియట్స్, తారే జమీన్ పర్ లాంటి సినిమాలతో పోల్చితే ఆ రేంజ్ కి వెళ్ళలేక పోయినా కూడా ఉన్నంతలో ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంది సినిమా…సినిమా ఎండ్ అయ్యాక ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి రావడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here