బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోలలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వాళ్ళో ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ఒకరు…రీసెంట్ టైంలో ఎక్కువగా మాస్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న రామ్ కి లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ భారీ నిరాశ ని మిగిలించగా మళ్ళీ మునుపటి లుక్ లోకి వచ్చిన రామ్…
కందిరీగ టైం లుక్ తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమాతో రాబోతున్నాడు….రీసెంట్ గా రామ్ పుట్టిన రోజు కానుకగా సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా రామ్ న్యూ లుక్ అండ్ సినిమా థీమ్ చూస్తుంటే ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర…
రామ్ సాలిడ్ కంబ్యాక్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం అనిపిస్తుంది…సినిమా టైటిల్ ను ఆంధ్ర కింగ్ తాలుకా(Andhra King Taluka Movie) అంటూ కన్ఫాం చేయగా సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర మేజర్ రోల్ ప్లే చేయబోతుండగా…ఆ రోల్ కి…
వీర లెవల్ ఫ్యాన్ గా రామ్ నటించబోతున్నాడు. అందుకే సినిమాకి బయోపిక్ ఆఫ్ ఫాన్ అంటూ టాగ్ లైన్ ని కూడా పెట్టగా….కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని టీం ఆల్ రెడీ చెబుతూ ఉండగా సినిమాలో రామ్ కి జోడిగా బాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది….
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం మహేష్ బాబు డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతూ ఉండగా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందని సమాచారం. టైటిల్ గ్లిమ్స్ వరకు సినిమా ఎలా ఉండబోతుందని కొంచం హింట్ ఇచ్చినప్పటికీ…
ఓవరాల్ గా ఒక హీరోకి ఫ్యాన్ కి మధ్య జరిగే కథగా సినిమా ఉంటుందని టాక్ ఉంది…కానీ అది బాలీవుడ్ లో వచ్చిన షారుఖ్ ఖాన్ ఫాన్ తరహా ఉంటుందా లేక ఎంటర్ టైన్ మెంట్ వే లో సాగుతుందా అన్నది సినిమా టీసర్ ట్రైలర్ లతో ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు…