రోబో కి స్పందనలు వస్తే, అది ఎంతటి ప్రళయానికి దారి తీస్తుందో అన్నది మనం రోబో సినిమా లో చూశాం, కానీ రోబో మన లైఫ్ లో ఒక భాగం అవుతూ దానికి అలవాటు పడిపోతే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో మలయాళం లో లాస్ట్ ఇయర్ ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ అనే సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకోగా ఆ సినిమా ను ఇప్పుడు తెలుగు లో…
ఆండ్రాయిడ్ కట్టప్ప 5.25 పేరు తో డబ్ చేసి ఆహ వీడియో లో డైరెక్ట్ రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది, ఎలా మెప్పించింది లాంటి విశేషాలు తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే ఇంజనీరింగ్ చదువుకున్న కొడుకు ఎన్ని జాబ్స్ చేస్తున్నా…
కొడుకు తనతోనే ఉండాలి అని భావించే హీరో తండ్రి ప్రతీ సారి ఎదో ఒక సాకుతో కొడుకుని తనదగ్గరకు రప్పించు కుంటూ ఉంటాడు, అది ఒక స్టేజ్ దాటాకా చిరాకు వచ్చిన కొడుకు హోమ్ నర్స్ ను అపాయింట్ చేసి జపాన్ లో ఉద్యోగం కోసం వెళతాడు…
తర్వాత హోమ్ నర్స్ తో హీరో తండ్రి గొడవ పడటం తో మళ్ళీ ఒంటరి అయిన తండ్రి కోసం తన కంపెనీ తయారు చేసిన ఓ రోబో ని పట్టుకువస్తాడు, తర్వాత తండ్రి ఆ రోబో ని ముందు దగ్గరికి రానివ్వ కుండా ఉన్నా తర్వాత అలావాటు పడతాడు.. కానీ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా ఓవరాల్ కథ పాయింట్….
పెర్ఫార్మెన్స్ పరంగా తక్కువ క్యారెక్టర్ లు అయినా అందరూ అద్బుతంగా నటించారు… ఎవ్వరికీ వంక పెట్టడానికి ఎం లేదు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది అదే సినిమా మైనస్… బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రొడక్షన్ వాల్యూస్, డైలాగ్స్ డైరెక్షన్ ఇలా అన్నీ చాలా బాగా ఆకట్టుకుంటాయి…
సినిమా కథ పాయింట్ ఎంత యూనిక్ గా ఉందో అదే విధంగా ఆద్యంతం సింపుల్ సీన్స్ వస్తున్నా కానీ మెప్పిస్తుంది, ఒక ముసలాయన కి ఇప్పటి టెక్నాలజీ గురించి ఒక రోబో వివరిస్తుండటం, ఆ రోబో కి ఈ ముసలాయన అలవాటు పడటం చాలా చక్కగా చూపెట్టారు.
కానీ సినిమా అసలు కథలోకి వెళ్ళడానికి టైం పడుతుంది, ముందు అనవసరపు సీన్స్ చాలానే వస్తాయి, డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళలేరు కాబట్టి ఈ సీన్స్ కూడా సినిమా కి ముఖ్యమైనవే అని చెప్పాలి, ఒక్కసారి కథలోకి ఇన్వాల్ అయ్యాక సినిమా మొత్తం ఎప్పుడు గడిచిందో కూడా తెలియకుండా గడచిపోతుంది.
ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో ఏ సినిమా రాలేదు, రోబో సిరీస్ ఆల్ రెడీ వచ్చినా అవి కమర్షియల్ మూవీస్, కానీ ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప హృదయానికి హత్తుకునే ఓ మంచి సినిమా… చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ అలరించే అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా…
కొంచం ఓపిక చేసుకుని కథలోకి వెళ్ళే దాకా ఓపిక పట్టి సినిమా చూస్తె తర్వాత క్లైమాక్స్ వరకు సినిమాలో లీనం అయిపోతారు. డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారు, కొత్త కథలను చూసే వారికి సినిమా చాలా బాగా మెప్పిస్తుంది, రొటీన్ మూవీస్ చూసే వాళ్లకి కూడా…
మొదటి 30 నిమిషాలు బోర్ కొట్టినా తర్వాత కథ ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. మలయాళం మూవీ నే అయినా కానీ తెలుగు ఆడియన్స్ ని కూడా సినిమా చాలా బాగా మెప్పించే అవకాశం ఉంది, సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3.25 స్టార్స్…. మంచి సినిమా మిస్ కాకండి..