Home గాసిప్స్ 100 వ సినిమా ట్రై చేస్తే 107 వ సినిమా దొరికింది కానీ!!

100 వ సినిమా ట్రై చేస్తే 107 వ సినిమా దొరికింది కానీ!!

1461
0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా లు 105, ఇప్పుడు 106 వ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్నాడు బాలయ్య. కాగా బాలయ్య ప్రతిష్టాత్మక 100 వ సినిమా గా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన విషయం తెలిసిందే. కాగా అందరి లాగే 100 వ సినిమా చాలా స్పెషల్ గా ప్లాన్ చేసు కుని అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాలయ్య.

ఆ 100 వ సినిమా ను డైరక్ట్ చేయాలని టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేశారు… వారిలో అప్పుడు అప్ కమింగ్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు… పటాస్ తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి సుప్రీమ్ తో మరో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి…

మొదటి నుండి బాలయ్య అభిమాని అవ్వడం తో 100 వ సినిమ డైరెక్టర్స్ రేసు లో తాను కూడా ఉన్నాడట… కథ వినిపించడం కూడా జరిగిందట కానీ చివర్లో క్రిష్ చెప్పిన శాతకర్ణి కథ నచ్చడం తో అదే 100 వ సినిమా గా మారింది. కాగా 100 వ సినిమా ట్రై చేసి మిస్ చేసుకున్న…

అనిల్ రావిపూడి ఇప్పుడు బాలయ్య 107 సినిమా రేసులో ముందు నిలిస్తున్నాడు అన్నది లేటెస్ట్ టాక్. బాలయ్య ప్రస్తుతం బోయపాటి తో చేస్తున్న 106 వ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో పూర్తీ అవుతుందని టాక్ ఉంది, అది అయిన వెంటనే అనిల్ రావిపూడి తో సినిమా ను 2021 మొదట్లో మొదలు పెట్టాలని సెకెండ్ ఆఫ్ స్టార్టింగ్ లో ఆ సినిమాను…

రిలీజ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారని టాలీవుడ్ లేటెస్ట్ టాక్. కానీ ఇవన్నీ కూడా కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత బాలయ్య బోయపాటి షూటింగ్ ఈ ఇయర్ ఎండ్ లో కంప్లీట్ అయితేనే సాధ్యం అని, లేదంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఇయర్ కి పోస్ట్ పోన్ అయితే అనిల్ రావిపూడి ఈ గ్యాప్ లో ఎఫ్ 3 తీస్తారని తర్వాత వీళ్ళ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here