మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగు లో డబ్ చేస్తూ విరివిగా రిలీజ్ చేస్తున్న ఆహా వీడియో వాళ్ళు లేటెస్ట్ గా మరో మంచి సినిమాను మలయాళం నుండి తెలుగు లోకి తీసుకు వచ్చారు, తెలుగు లో వచ్చిన రాక్షసుడు సినిమా తరహా సైకో థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన అంజన పాతిక సినిమా ను తెలుగు లో మిడ్ నైట్ మర్డర్స్ గా డబ్ చేసి రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు…
తెలుగు డబ్బింగ్ చాలా బాగా సెట్ అవ్వగా సినిమా కథ పాయింట్ పోలిస్ ఆఫీసర్స్ ని ఒక సైకో చంపుతూ ఉంటాడు, అతని మోటో ఏంటి ఎందుకని చంపుతున్నాడు. చివరికి ఎలా దొరికాడు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్… ఆద్యంతం తర్వాత సీన్ ఏమవుతుందా…
అన్న ఉత్కంటతో సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది, సైకో ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్ మరీ ఎఫెక్టివ్ గా లేకున్నా కానీ ఓవరాల్ గా సినిమా ఓ చక్కటి థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ ని కలిగిస్తుంది, అచ్చూ రాక్షసుడు సినిమా తరహలోనే ఉండే ఈ సినిమా ఆ సినిమా రేంజ్ కి తగ్గట్లు…
చాలా వరకు మెప్పించడం విశేషం అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ చక చకా గడిచి మంచి పాయింట్ తో ఇంటర్వెల్, తర్వాత సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అయ్యాక కొద్ది సేపటి తర్వాత ట్విస్ట్ మీద ట్విస్ట్ తో సినిమా చాలా బాగా మెప్పిస్తుంది… ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి వెన్నెముకగా నిలిచి కీలక సీన్స్ ని మరింత బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది అని చెప్పాలి. రీసెంట్ టైం లో రాక్షసుడు తర్వాత వన్ ఆఫ్ ది…
బెస్ట్ సైకో థ్రిల్లర్ జానర్ మూవీస్ లో ఈ సినిమా ముందు నిలిచే అవకాశం ఉంటుంది… ఓవరాల్ గా సినిమా రాక్షసుడు సినిమా చూసిన వాళ్ళని కూడా బాగా మెప్పిస్తుంది, రొటీన్ మూవీస్ చూసి చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఈ సినిమా ను చూస్తె ఓ మంచి థ్రిల్లర్ మూవీ ని చూశాం అని చెప్పడం ఖాయం….