బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) అందుకోవాల్సిన టార్గెట్ మరీ ఎక్కువ అవ్వడంతో కలెక్షన్స్ పరంగా…
తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు…ఇక సినిమా కి మొదటి నుండి అనేక అవరోధాలు ఎదురు అయిన విషయం తెలిసిందే. షూటింగ్ లో డిలే, బడ్జెట్ డబుల్ అయిపోవడం, రిలీజ్ మరీ లేట్ అవ్వడం, బజ్ లేక పోవడం….
ఓపెనింగ్స్ నిరాశ పరచడం…మిక్సుడ్ టాక్ రావడం ఇలా సినిమా కి అనేక అవరోధాలు ఎదురు అయ్యాయి. ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమా ప్రింట్ కూడా లీక్ అయ్యింది…అది తర్వాత చిన్న చిన్న లోకల్ ఛానెల్స్ లో కూడా టెలికాస్ట్ చేశారు…ఇక బాక్స్ ఆఫీస్ రన్…
ఆల్ మోస్ట్ స్లో డౌన్ అవుతున్న టైంలో సినిమా అఫీషియల్ మాస్టర్ ప్రింటే లీక్ అయ్యింది….ఒరిజినల్ వర్షన్ అనిపించేంత క్లారిటీతో 4K లో సినిమా ప్రింట్ లీక్ అవ్వగా సినిమా కి అసలే కలెక్షన్స్ మరింత తగ్గడంతో ఈ ప్రింట్ లీక్ వలన వచ్చే కలెక్షన్స్ కి కూడా మరింత ఎదురుదెబ్బ తగిలింది…
ఎడిటింగ్ రూమ్ నుండే సినిమా ప్రింట్ లీక్ అయ్యింది అంటూ వార్తలు వస్తూ ఉన్నప్పటికీ రీసెంట్ టైంలో పెద్ద సినిమాలు అన్నింటికీ రెండు మూడు వారాలకే మాస్టర్ ప్రింట్ లు లీక్ అవుతున్నాయి. ఇండస్ట్రీ దీనిపై గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…
గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పటికే అనేక దెబ్బలు తగలగా ఇప్పుడు ఫైనల్ గా ఈ దెబ్బ కూడా తగిలి బాక్స్ ఆఫీస్ రన్ ని మరింత క్షీణించేలా చేసింది…ఓవరాల్ గా ఔట్ రైట్ రిజెక్షన్ సొంతం అవ్వాల్సిన అంత బ్యాడ్ గా ఏమి లేని సినిమాకి ఆల్ సైడ్స్ నుండి అలాంటి రిజెక్షన్ ఇప్పుడు సొంతం అయ్యింది.