Home న్యూస్ ఆల్ రెడీ 100K….నాని మాస్ స్టార్ట్!!

ఆల్ రెడీ 100K….నాని మాస్ స్టార్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని మరియు నజ్రియా ఫహాద్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా భారీ అంచనాల నడుమ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా, నాని సినిమాలకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఓవర్సీస్ లో కూడా మంచి బజ్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

   

ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న అంటే సుందరానికీ సినిమా పై అక్కడ కూడా మంచి అంచనాలు ఉండగా సినిమా కి అడ్వాన్స్ టికెట్ సేల్స్ సూపర్ సాలిడ్ గా కొనసాగుతూ ఉండగా సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో…

ఓవరాల్ గా $100K డాలర్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుంది. ఫైనల్ లెక్కలు ఇంకా కొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అక్కడ సినిమా కి బజ్ పాజిటివ్ గా ఉండటంతో ఎర్లీ షోలను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక పాజిటివ్ టాక్ వస్తే అక్కడ కూడా సినిమా దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here