బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయింది. టోటల్ రన్ లో 21.35 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఎంత బడ్జెట్ లో తెరకెక్కింది. టోటల్ బిజినెస్ ఎంత… పరుగు పూర్తీ అయిన తర్వాత అన్నీ లెక్కలోకి తీసుకుంటే బడ్జెట్ మీద లాభం వచ్చిందో లేదో తెలుసుకుందాం పదండీ…
సినిమాను మొత్తం మీద 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొంచారు… సినిమా థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లకు జరిగింది. ఇక డిజిటల్ రేటు 7.50 కోట్ల దాకా పలికిందని సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ 6 కోట్ల దాకా పలికాయట. హిందీ డబ్బింగ్ రైట్స్ 4 కోట్లు పలకగా మ్యూజిక్ రైట్స్ 60 లక్షల దాకా సొంతం అయ్యిందట.
దాంతో టోటల్ బిజినెస్ ను గమనిస్తే… 48.10 కోట్ల దాకా పలికింది… అంటే నిర్మాతలకు సినిమా మీద పబ్లిసిటీ ఖర్చులు పోనూ 6 కోట్లకు పైగా లాభం వచ్చింది అనుకోవచ్చు. కానీ బాక్స్ ఆఫీస్ నష్టాన్ని టోటల్ బిజినెస్ లో తీసేస్తే… అటూ ఇటూగా మైనస్ నష్టాలు వచ్చాయి అని చెప్పొచ్చు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ ఫలితం సినిమాను చాలా గట్టిగా దెబ్బ కొట్టింది.