Home న్యూస్ అంటే సుందరానికీ ట్రైలర్ రివ్యూ….కుమ్మిందిగా ట్రైలర్!!

అంటే సుందరానికీ ట్రైలర్ రివ్యూ….కుమ్మిందిగా ట్రైలర్!!

0

నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ…. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా కొంత గ్యాప్ తర్వాత నాని నుండి వస్తున్న ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీసర్ కుమ్మేయగా ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా టీసర్ రేంజ్ కన్నా ఎక్కువే కుమ్మేసింది అని చెప్పాలి ఇప్పుడు…

బ్రాహ్మణుడు అయిన హీరో క్రిస్టియన్ అయిన హీరోయిన్… ఇద్దరు ప్రేమించుకోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో ఈ ఇద్దరు ఏం చేశారు అన్న రొటీన్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కినట్లు ట్రైలర్ లో అర్ధం అయినా ఎంచుకున్న నేపధ్యం ఫుల్ కామెడీని పండించే విధంగా ఉండటంతో….

ఓవరాల్ గా ట్రైలర్ బాగా మెప్పించింది అని చెప్పాలి. నాని కామెడీ టైమింగ్ తో కుమ్మేయగా నజ్రియా క్యూట్ లుక్స్ తో మెప్పించింది. ఇద్దరి పెయిర్ కూడా ఆకట్టుకోగా మొత్తం మీద ట్రైలర్ చూసిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉన్న సినిమా గా అనిపించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here