Home న్యూస్ అంటే సుందరానికీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

అంటే సుందరానికీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చేసింది, బ్రోచేవారెవరురా లాంటి క్లాస్ బ్లాక్ బస్టర్ కొట్టిన వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మలయాళ బ్యూటీ నజ్రియా ఫస్ట్ టైం తెలుగు లో యాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది ఎంత వరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

స్ట్రిక్ట్ బ్రాహ్మణ్ అయిన హీరో క్రిస్టియన్ అయిన హీరోయిన్ చిన్నప్పటి స్నేహితులు… పెద్దయ్యాక వీళ్ళు ప్రేమలో పడగా వీళ్ళ ఫ్యామిలీస్ అడ్డుగా నిలుస్తాయి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ప్రేమ సఫలం అయిందా లేదా అన్నది సినిమా అసలు కథ పాయింట్… కథ పరంగా సింపుల్ స్టొరీ పాయింట్ తోనే సినిమా తెరకెక్కినా కానీ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి….

టైం పట్టినా కానీ ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో ఆకట్టుకుంటూ సాగిన ఫస్టాఫ్ బాగుంది అనిపించగా సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను తగ్గట్లు ఆకట్టుకోవడమే కాదు సెకెండ్ ఆఫ్ లో కొన్ని ట్విస్ట్ లు మెస్మరైజ్ చేసి ఓవరాల్ గా అనుకున్న అంచనాలను అందుకునేలా ముగుస్తుంది అని చెప్పాలి. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే నాచురల్ స్టార్ నాని….

భలే భలే మొగాడివోయ్ తర్వాత ఫుల్ కామెడీతో దుమ్ము దులిపేశాడు… సిట్చువేషనల్ కామెడీ టైమింగ్ తో దుమ్ము లేపగా తన పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది… ఇక తెలుగు లో ఫస్ట్ టైం నటిస్తున్న నజ్రియా బాగా ఆకట్టుకోగా ఇద్దరి పెయిర్ కూడా ఓ రేంజ్ లో మెప్పించింది. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు….

ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆడియో పరంగా జస్ట్ యావరేజ్ అనిపించినా విజువల్స్ తో చూసినప్పుడు మాత్రం బాగానే మెప్పించాయి అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం టేక్ ఆఫ్ కి టైం పట్టడం తో కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినప్పటికీ కూడా ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వడంతో లెంత్ కొంచం ఎక్కువ అయినా కానీ ఓవరాల్ గా మాత్రం ఆకట్టుకుంది…

సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ స్టొరీ పాయింట్ చాలా సింపుల్ దే తీసుకున్నా కానీ చెప్పిన విధానం మాత్రం ఆకట్టుకుంది, కొంచం లాగ్ అయినట్లు అనిపించినా కానీ మోస్ట్ ఆఫ్ ది మూవీ తను అనుకున్నట్లు తెరకెక్కించి మెప్పించాడు…. లెంత్ కొంచం తక్కువ తగ్గించి ఉంటె సినిమా ఇంకా చాలా బాగా మెప్పించి ఉండేది…

మొత్తం మీద సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాని, నజ్రియాల పెర్ఫార్మెన్స్, ఇతర స్టార్ కాస్ట్ ఆకట్టుకోవడం, ఎంటర్ టైన్ మెంట్ బాగుండటం, ఎమోషనల్ టచ్ మెప్పించడం, సెకెండ్ ఆఫ్ ట్విస్ట్ లు ఆకట్టుకోవడం మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా లెంత్ ఎక్కువ అవ్వడం, కథ టేక్ ఆఫ్ కి టైం పట్టడం లాంటివి స్మాల్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి…

ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి కానీ అంచనాలతో థియేటర్స్ వెళ్ళిన ఆడియన్స్ ని అయినా ముందు చెప్పినట్లు లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించినా ఓవరాల్ గా ఓ మంచి ఎంటర్ టైన్ మెంట్ విత్ గుడ్ మెసేజ్ ఉన్న మూవీ చూశాం అన్న ఫీలింగ్ తో థియేటర్ బయటికి రావడం ఖాయమని చెప్పాలి. మొత్తం మీద సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here