నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని ఓ రేంజ్ లో సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి ఫ్లాఫ్ గానే పరుగును కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది, ఫైనల్ రన్ లో ఈ సినిమా 31 కోట్ల టార్గెట్ కి గాను…
21.35 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా టోటల్ గా 9.65 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని ఫ్లాఫ్ గా పరుగును కంప్లీట్ చేసుకోగా తర్వాత డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ నే సొంతం చేసుకున్నా సినిమా కి దక్కాల్సిన రెస్పాన్స్ అయితే…
అనుకున్న రేంజ్ లో దక్కలేదు, దాంతో టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కచ్చితంగా సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తుందని అందరూ అనుకున్నారు కానీ సినిమాను రీసెంట్ గా జెమినీ టీవీ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ చేయగా సినిమా వచ్చిన రేటింగ్ అందరి మైండ్ బ్లాంక్ చేసింది.
పేరు ఊరు లేని సినిమాలు సైతం అడపాదడపా మంచి రేటింగ్స్ ని తెచ్చుకున్న సందర్బాలు అనేకం ఉండగా ఇప్పుడు అంటే సుందరానికీ ఫస్ట్ టైం టెలికాస్ట్ లో కేవలం 1.88 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యి టెలివిజన్ లో ఎపిక్ డిసాస్టర్ రేటింగ్ ను దక్కించుకుని ఊహించని రేంజ్ లో నిరాశపరిచింది.