సీఎం నే నెగటివ్ గా చూపెట్టారు…కేసులు పెడుతున్నారు….రిలీజ్ పై ఎదురుదెబ్బ!

0
667

స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ పై తెరకెక్కించిన బయోపిక్ ఫ్లాఫ్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి అసలు కథ అంటూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” పై పడింది, ఇప్పటికే సినిమా కి కావలసినంత బజ్ ఉండటం తో భారీ గా సినిమా ను ఈ నెల 22 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ కి ఇప్పుడు ఎలక్షన్స్ డేట్స్ కన్ఫాం అవ్వడం తో అధికార….

ప్రభుత్వం నుండి కొందరు సినిమా ను ఆపడానికి అధికారికంగా ఎలక్షన్ కమీషన్ కి సినిమా లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నే తప్పుగా చూపెట్టారని, ఇది ఎలక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటూ చెబుతున్నారట. దాంతో సినిమా ని ఆపాలని వారు కోరుతున్నారు.

ఈ పరిణామాల పై రామ్ గోపాల్ వర్మ కొంచం సీరియస్ అవుతూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేయడమే కాకుండా ఇప్పుడు చానెల్స్ లో ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నాడు. మరి ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో త్వరలో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!