బాక్స్ అఫీస్ దగ్గర బాహుబలి రిలీజ్ నుండి తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ మరో లెవల్ లో వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. బాహుబలి సిరీస్ తో మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీగా జరగగా స్టార్ హీరోల సినిమాలకు అన్నింటికీ కూడా భారీగా టికెట్ హైక్స్, ఎక్స్ ట్రా షోలు, స్పెషల్ షోలు ఇలా కావలసినన్ని అడ్వాంటేజ్ లు లభిస్తూ ఉండటం తో కలెక్షన్స్ ఊరమాస్ గా సొంతం చేసుకుంటూ ఒక్కో స్టార్ హీరో సినిమా…
ఓపెనింగ్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తూ వస్తుండగా లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్ తో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా బాక్స్ ఆఫీస్ ను సాలిడ్ గా షేక్ చేశాడు కానీ ఆ సినిమా రిలీజ్ టైం లో టికెట్ హైక్స్ ని కంప్లీట్ గా తగ్గించిన ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయంతో అప్పటి నుండి….
ఓపెనింగ్స్ పరంగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతూ ఉండగా ఇయర్ ఎండ్ లో వచ్చిన అఖండ కానీ పాన్ ఇండియా మూవీ పుష్ప కి గాని ఎఫెక్ట్ గట్టిగానే పడింది ఆంధ్రలో. ఇక ఇప్పుడు ఆంధ్రలో ఎఫెక్ట్ పడిన భీమ్లా నాయక్ నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా….
ఆంధ్రలో మాత్రం ఓపెనింగ్స్ నిరాశ పరిచాయి. అయినా కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా… ఒకసారి టాప్ 10 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే….
1. Baahubali2- 43C
2. Sye Raa Narasimha Reddy- 38.75Cr
3. Saaho – 36.52Cr
4. Sarileru Neekevvaru – 32.77Cr
5. VakeelSaab – 32.24Cr
6. Aravindha Sametha- 26.64C
7. Bheemla Nayak – 26.42CR
8. Agnyaathavaasi-26.40C
9. Vinaya Vidheya Rama-25.99C
10. Ala Vaikunthapurramuloo – 25.93Cr
11. Pushpa – 24.90Cr
భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ ఆల్ మోస్ట్ 4 ఏళ్ల క్రితం అజ్ఞాతవాసి, అరవింద సమేత రేంజ్ లో ఉన్నాయి, అది కూడా నైజాంలో అప్పటితో పోల్చితే డబుల్ కలెక్షన్స్ రావడం వలెనే సాధ్యం అయింది, కానీ కొత్త టికెట్ రేట్స్ అనౌన్స్ మెంట్ త్వరలోనే జరగబోతుండటంతో త్వరలో వచ్చే పెద్ద సినిమాలకు మళ్ళీ మునుపటిలా ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంటుందని చెప్పాలి.