గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి…మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో సినిమా షేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు…కానీ మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా రాంపెజ్ ను చూపించ లేక పోయింది…
ఫస్ట్ డే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 42-45 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు అనుకున్నా కూడా, మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయిన సినిమా ఫస్ట్ డే ఓవరాల్ గా 39.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించినా కూడా….
ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ను సినిమా నుండి అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు…ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో ఆల్ టైం టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ మూవీ….అనుకున్న రేంజ్ లో టాక్ వచ్చి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించి ఉండేది..
ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
AP TG 1st Day Highest Share Movies
1. RRR Movie – 74.11CR
2. Pushpa 2 The Rule – 70.81CR
3. Devara part 1 – 61.65CR
4. SALAAR- 50.49CR
5. Kalki 2898 AD – 44.86CR
6. Baahubali2- 43CR
7. Game Changer – 39.52CR******
8. Guntur Kaaram – 38.88CR
9. Sye Raa Narasimha Reddy- 38.75Cr
10. Saaho – 36.52Cr
11. Sarkaru Vaari Paata – 36.01CR
12. Adi Purush – 32.84Cr
13. Sarileru Neekevvaru – 32.77Cr
14. VakeelSaab – 32.24Cr
15. Acharya – 29.50Cr
మొత్తం మీద రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తుంది అనుకున్న గేమ్ చేంజర్…అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది… కానీ ఉన్నంతలో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో సంక్రాంతి సెలవులలో ఓవరాల్ గా మంచి జోరునే చూపించే అవకాశం ఉంది. ఇక సినిమా లాంగ్ రన్ లో బిజినెస్ కి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.