టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది. తొలిరోజు అంచనాలను మించే కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకున్న ఈ సినిమా దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేసింది. ఎన్టీఆర్ నటించిన లాస్ట్ సోలో మూవీ అరవింద సమేత(Aravindha Sametha) వచ్చిన 6 ఏళ్ళకి ఎన్టీఆర్ నుండి వచ్చిన…
సినిమా అవ్వగా ఈ 6 ఏళ్ల గ్యాప్ లో టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగి పోయింది…అప్పట్లో ఎన్టీఆర్ ఓపెనింగ్స్ గట్టిగా కొట్టినా కూడా లాంగ్ రన్ ఉండదని, నైజాం ఏరియాలో లేట్ గా 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న హీరో అంటూ ట్రోల్ చేసేవాళ్ళు….అరవింద సమేత మూవీ టోటల్ రన్ లో ఆ టైంలో నైజాం ఏరియాలో మొత్తం మీద…
21.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…ఇప్పుడు భారీగా పెరిగిన టాలీవుడ్ మార్కెట్ లో మొదటి రోజే నైజాం ఏరియాలో ఎన్టీఆర్ దేవర ఏకంగా 22.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్లేస్ లో నిలిచే రేంజ్ లో ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించింది సినిమా…
ఇక అరవింద సమేత సినిమా టోటల్ రన్ లో 98 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే ఇప్పుడు ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చిన దేవర మూవీ ఆ కలెక్షన్స్ ని కేవలం మొదటి రోజే అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది…6 ఏళ్లలో పెరిగిన టాలీవుడ్ మార్కెట్ అలాగే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగి పోవడం ఇప్పుడు…
దేవర విషయంలో భారీగా హెల్ప్ అయ్యి ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఇదే రేంజ్ లో జోరుని సినిమా లాంగ్ రన్ లో చూపిస్తే అవలీలగా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకుని మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…