Home న్యూస్ 158 కోట్లు…ఈ వారం కీలకం!!

158 కోట్లు…ఈ వారం కీలకం!!

464
0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ మొదటి 11 రోజుల్లోనే టోటల్ టార్గెట్ ని వెనక్కి తీసుకు రాగా సినిమా తర్వాత స్లో డౌన్ అయినా కానీ అప్పటికే చాలా వరకు దుమ్ము లేపింది అని చెప్పొచ్చు. ఇక 15 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 71.05 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా… 95.37 కోట్ల షేర్ ని, 157.5 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఇక సినిమా 16 వ రోజు 15 వ రోజు కన్నా కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేయగా ఓవరాల్ గా 16 వ రోజు వసూళ్ళతో సినిమా 158 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటి నుండి సినిమా కలెక్షన్స్ చాలా కీలకం అని చెప్పాలి.

రెండు రాష్ట్రాలలో శని ఆదివారాలలో సినిమా హోల్డ్ చేసే విధానాన్ని బట్టి 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందా లేదా అన్నది క్లియర్ గా తెలియనుంది. పెద్దగా పోటి లేదు కాబట్టి హోల్డ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here