తెలుగు సినిమా కి 2018 ఇయర్ చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి.ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల ను ఎక్కువ శాతం ఆకట్టు కోగా మిగిలిన పెద్ద సినిమాలు అయిన రంగస్థలం, భరత్ అనే నేను మరియు ఇప్పుడు అరవింద సమేత లు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మ్రోత మ్రోగించాయి.
కాగా రంగస్థలం టోటల్ రన్ లో 215 కోట్ల గ్రాస్ ని అందుకోగా తర్వాత వచ్చిన భరత్ అనే నేను 170 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా 17 వ రోజు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 160 కోట్ల మార్క్ ని ఆల్ మోస్ట్ టచ్ చేసింది.
18 వ రోజు మార్నింగ్ షోలతో ఈ మార్క్ కంప్లీట్ కానుండగా ఈ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమాలలో మూడో సారి 160 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా అరవింద సమేత సంచలనం సృష్టించింది. మరే ఇయర్ లో కూడా ఇలాంటి అద్బుతం జరగలేదనే చెప్పాలి.