టెంపర్ కి ముందు వరకు ఫాం పరంగా వెనుక బడినా టెంపర్ తర్వాత వరుస పెట్టి మూవీస్ చేస్తూ అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లాస్ట్ మూవీ అరవింద సమేత వచ్చి ఆల్ మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ రేటు కూడా అప్పుడే సాలిడ్ గా పలికి సంచలనం సృష్టించింది.
కానీ సినిమా హిందీ డబ్ వర్షన్ టెలికాస్ట్ ఇప్పటి వరకు జరగలేదు, ఎట్టకేలకు ఆల్ మోస్ట్ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా హిందీ డబ్ వర్షన్ ఇప్పుడు జీ సినిమా హిందీ లో టెలికాస్ట్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. దానికి గాను ప్రోమోని రిలీజ్ చేశారు.
సినిమా హిందీ డబ్బింగ్ రేటు అప్పుడే 18 కోట్లు పలకగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. కానీ హిందీ డబ్బింగ్ పనులు చాలా ఆలస్యం అవ్వగా ఇప్పుడు త్వరలోనే టెలివిజన్ లో ఈ సినిమా కి టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక యూట్యూబ్ లో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అన్నది ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది.
ఇక ఈ సినిమా హిందీ డబ్ వర్షన్ త్వరలోనే రిలీజ్ కానుండగా రీసెంట్ టైం లో కన్నడ లో కూడా తెలుగు సినిమాలు ఒకటి తర్వాత ఒకటి డబ్ అవుతూ టెలికాస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ అరవింద సమేత కూడా అక్కడ డబ్ వర్షన్ టెలికాస్ట్ కాబోతుందని సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.
అవి అయిన వెంటనే త్వరలో కన్నడ లో కూడా సినిమా టెలికాస్ట్ డేట్ ని అనౌన్స్ చేస్తారట. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కమిట్ అయిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఇయర్ సంక్రాంతికి రావాల్సి ఉన్నా కరోనా ఎఫెక్ట్ వలన సమ్మర్ లేదా సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని తిరిగి వెండితెర పై మరో ఏడాది దాకా చూడలేరు..