Home న్యూస్ 70 లక్షలు కొడితే మరో సెన్సేషన్

70 లక్షలు కొడితే మరో సెన్సేషన్

631
0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 23 రోజుల్లో 90.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి 98.04 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపే రేంజ్ లో 8 కోట్ల లాభం దిశగా ఒక్కో అడుగు ముందుకెస్తూ దూసుకు పోతుంది. కాగా సినిమా 23 రోజులు ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సంచలన రికార్డ్ ను అందుకోవడానికి సిధ్ధం అవుతుంది అని చెప్పొచ్చు.

సినిమా టోటల్ గా 23 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 163.3 కోట్ల మార్క్ ని దాటగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 70 లక్షల గ్రాస్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 164 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో మెగా స్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ సెంసేషన్ ఖైదీ నంబర్ 150 టోటల్ గ్రాస్ ని అందుకుంటుంది.

ఆ సినిమా 164 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు అరవింద సమేత కి మరో 70 లక్షల గ్రాస్ కావాల్సి ఉంది. కానీ షేర్ పరంగా ఖైదీ నంబర్ 150 104 కోట్లని అందుకోవడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here